గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - May 20, 2020 , 02:27:03

ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

 బస్టాండ్‌లు, డిపోల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం

 మాస్క్‌లతో విధులకు హాజరైన డ్రైవర్లు, కండక్టర్లు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం కమాన్‌ బజార్‌: యాభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభు త్వం ప్రజా రవాణాను పునరుద్ధరించింది. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కి ప్రజలకు రవాణా సేవలు అందించాయి.ఈ ఏడాది మార్చి 22న జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది. అనేక రోజుల తర్వాత ఖ మ్మం రెడ్‌జోన్‌, భద్రాద్రి గ్రీన్‌జోన్‌ అనే ప్రకటన వెలువడింది. ఈ నెల 4వ తేదీ నుంచి కొన్ని సడలింపులతో వ ర్త క, వాణిజ్య, వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. తాజాగా ఆర్టీసీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దీం తో ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు ప్రారంభించారు.

లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లూ ఖాళీగా దర్శనమిచ్చిన రహదారులన్నీ ఇప్పుడు రద్దీగా కనిపించాయి. ఉదయం 6.30 గంటల నుంచే బస్సులను సిద్ధం చేసి వివిధ రూట్లల్లో  నడిపారు. విధులకు హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగులు పలు జాగ్రత్తలను తీసుకుంటూ విధులకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, ఖమ్మం, మధిర డిపోలకు చెందిన బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. బస్సులను శానిటైజ్‌ చేసిన తర్వాతే బయటకు పంపించాలనే ప్రభుత్వాదేశాలను ఆర్టీసీ అధికారులు పాటిస్తున్నారు.  

భద్రాద్రి జిల్లాలో 106 బస్సులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్రకటించాయి. దీంతో ఊపిరి పీల్చుకు న్న ప్రజానీకం మే4 లాక్‌డౌన్‌లో వెసులుబాటు కలగడంతో తమ రోజువారీ పనులలో చక్కబెట్టుకుంటూ వచ్చారు. అ యితే ప్రజారవాణా వ్యవస్థ అ యిన టీఎస్‌ఆర్‌టీసీ లేని కారణంగా ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. లాక్‌డౌన్‌తో దూర ప్రాంతాల నుంచి వచ్చే వీలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. టీఎస్‌ఆర్‌టీసీని పునరుద్ధరించడంతో ప్రజలు కొంత ఉపశమనం పొంది మంగళవారం ఉదయం నుంచే తమ ప్రయాణానికి బస్సులను ఆశ్రయించారు. దీంతో భద్రాచలం డిపో నుంచి 32, కొత్తగూడెం నుంచి 39, మణుగూరు నుంచి 35 బస్సులు మొత్తం మూడు డిపోల్లో తొలిరోజు 106 బస్సులను ఆర్‌టీసీ అధికారులు నడిపించారు. 

ఖమ్మం జిల్లాలో 246 బస్సులు..

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, మధిర డిపోల పరిధిలో మొత్తం 360 బస్సులు ఉండగా తొలిరోజు 246 బస్సు సర్వీసులు ప్రజలకు రవాణా సేవలు అం దించాయి. కంటైన్మెంట్‌ జోన్‌ తప్ప మిగతా అ న్ని ప్రాంతాల్లో నడిచాయి. హైదరాబా ద్‌ ప్రాంతం రెడ్‌జోన్‌ కావడంతో ఈ డిపోల నుంచి హయాత్‌నగర్‌ వరకు మాత్రమే వెళ్లాయి. ఖమ్మం డిపోకు చెందిన బ స్సులు కోదాడ, భద్రాచలం, సత్తుపల్లి, సూర్యాపేట తదితర ప్రాంతాలకు వెళ్లాయి. మధిర , ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి డిపోకు చెందిన బస్సులు ఎక్కువగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలకి వెళ్లాయి.

బస్సుల్లో భౌతికదూరం తప్పనిసరి..

బస్సుల్లో,బస్టాండ్‌, ప్రయాణికులు భౌతికదూరం పా టించే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. బస్సులో సుమారు 50 సీట్లు ఉంటే సగం మంది మాత్రమే ప్రయాణించేట్లు ఏర్పాట్లు చేశారు. డిపోలు, బస్టాండుల్లో సిబ్బంది తెల్లవారుజామునే శానిటైజ్‌ చేశారు. బస్సు ఎక్కిన వారికి శానిటైజర్‌ ఇచ్చి చేతులు శుభ్రం చేసుకున్నాకే ప్రయాణానికి అనుమతించారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర బస్టాండ్‌ల్లో ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో శానిటైజర్‌తో శుభ్రపరిచారు. డ్రైవర్లు, కండక్టర్లు మాస్క్‌లు, చేతి గ్లౌజులు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల్లో వాష్‌ బేషన్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది విధులకు రాగానే చేతులు శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. డిపోల్లో క్యాష్‌ కౌంటర్‌ వద్ద గుంపులు గుంపులుగా ప్రయాణికులు గుమికూడకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కండక్టర్లు భౌతిక దూరం పాటిస్తూ నగదు డిపాజిట్‌ చేశారు.

ఖమ్మం బస్టాండ్‌ను సందర్శించిన కలెక్టర్‌ కర్ణన్‌..

రవాణా సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సందర్శించారు. బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. ప్రయాణంలో భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు సూచించారు. మాస్కులు ధరించాలని, మాస్కులు లేకపోతే కనీసం చేతి రుమాలైనా ఉపయోగించాలన్నారు. ప్రయాణం తర్వాత ఇంటికి వెళ్లి చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణమూర్తి, డీవీఎం సుగుణాకర్‌, డీఎం శివశంకర్‌ తదితరులున్నారు. 

రవాణా ఇబ్బందులు తొలగాయి..

నేను వరంగల్‌ నుంచి కొత్తగూడెం వరకు బస్సులోనే వచ్చా. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే బస్సులోకి అనుమతిస్తున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఎలాంటి ఇ బ్బం ది లేకుండా ప్రయాణం సాగింది. బస్సులు నడిస్తేనే సందడిగా ఉంది. బస్సులు ఎప్పుడు నడుస్తాయని ఎదురుచూశాము.

  1. -రాజు, ప్రయాణికుడు, భద్రాచలం