శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 17, 2020 , 02:14:38

మీనం.. మురిపెం

మీనం.. మురిపెం

కొత్తగూడెం:తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. మిషన్‌ కాకతీయ చెరువు లు బతుకు దెరువు ఇచ్చాయి.  గతంలో ఎవరికి వారే చేపల ను పెంచుకోవడం, విక్రయించడం,దళారులు దండుకోవడం పరిపాటి.  రాష్ట్ర ప్రభుత్వం నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలను ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంది. జాలరుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమై ఆనందంగా ఉన్నాయి. విపత్కర పరిస్థి తుల్లో కూడా చేపలు విక్రయించి జీవనం పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 684 చేపల చెరువుల్లో  చేపలు పెరిగి పెద్దకావడంతో వాటి ని విక్రయించి ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాకు రూ.1.77 కోట్ల చేపపిల్లలను సహకార సంఘాల సభ్యులకు వందశాతం సబ్సిడీపై అందజేశారు.    రూ.1.14 కోట్ల నిధులను చేపపిల్లలకు వెచ్చించారు. అవి పెరిగి ఉపాధి కల్పించాయి.

మూడు చెరువుల్లో  రొయ్యపిల్లలు..

మూడు చెరువుల్లో రొయ్యలు కూడా వేశారు. బచ్చవారిగూడెం  పెదవాగు ప్రాజెక్టులో 1.69 లక్షలు,రాగబోయినగూడెం చెరువులో 23 వేలు,పరకాలగూడెం చెరువులో 19 వేల రొయ్యపిల్లలను వదిలారు.వీటికి రూ.3.98 లక్షల నిధులను ఖర్చుచేశారు. రొయ్యల పెంపకం ద్వారా మరింత ఆర్థికంగా లబ్ధిపొందనున్నారు.

గత ఏడాది చేప పిల్లల ద్వారా లబ్ధి.. 

భద్రాద్రి జిల్లాలో రూ.కోటి 9లక్షల చేపపిల్లలను 271 చెరువుల్లో వదలగా వాటిని విక్రయించి లబ్ధి పొందారు. గ్రామాలకు వెళ్లి చేపలను విక్రయించేందుకు  మత్స్యకారులకు ద్విచక్ర వాహ నాలను ప్రభుత్వం ఇచ్చింది. చేపల చెరువులు ఎంత దూరం అయినా వాహనాలపై వెళ్లి చేపలు విక్రయిస్తున్నారు.

 బలోపేతమవుతున్న సహకార సంఘాలు...

ప్రభుత్వం నిర్ణయంతో సహకార సంఘాలు బలోపేతమవుతున్నాయి. సొసైటీల పరిధిలో ఉన్న వారికి వలలు, వ్యాపారాభివృద్ధికి సైకిళ్లు, నిల్వ ఉంచేందుకు ఐస్‌ బాక్సులను ప్రభుత్వం అందజేస్తుంది.సొసైటీలో సభ్యులకు జీవిత బీమాను రూ.2 లక్షలకు పెంచింది. మరిన్ని సం ఘాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేలా మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇతర రాష్ర్టాలకు పంపించి తర్ఫీదు ఇప్పిస్తున్నారు.  

తెలంగాణ ప్రభుత్వంలో మరింత మేలు.. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలను ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంది. సహకార సం ఘాలను బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకు న్నాం.ఉచితంగా చేప, రొయ్య పిల్లలను ఇవ్వడంతో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 

-సూర్యం, మత్స్య సహకార సంఘం చైర్మన్‌

వ్యాపారం బాగా సాగుతోంది..

   ఎక్కడ చేపలు పట్టినా వెళ్లి కొనుగోలు చేస్తాం. చెరువు దగ్గరకు వెళ్లడం వల్ల కొంచెం తక్కువ ధరకు వస్తాయి. గతంలో వైరా నుంచి వచ్చే చేపలను కొనుగోలు చేసుకుని విక్రయించే వా ళ్లం. ఇక నుంచి ఆ సమస్యలేదు. మన చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంది. చేపలు కూడా బాగా పెరుగుతున్నాయి. 

-నరేశ్‌ వ్యాపారి, పాపకొల్లు, జూలూరుపాడు

మత్స్యకారులకు మంచి ఆదాయం..

చిన్న చెరువుల్లో చేపలు పట్టడం వాటిని విక్రయించడం కూడా పూర్తి అయింది. పెద్ద చెరువుల్లో లాక్‌డౌన్‌ కారణంగా చేపలు పట్టే ప్రక్రియ కొం త ఆలస్యమైంది. అయినప్పటికీ భౌతికదూరం పాటిస్తూ చేపలు పడుతున్నారు. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి కూడా చేపలు పట్టేవిధానాన్ని  పరిశీలించారు. - వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి