శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - May 15, 2020 , 01:16:22

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌

పెనుబల్లి : రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు వివిధ పథకాలు రూపొందించిన కేసీఆర్‌ రైతు బాంధవుడని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు అన్నారు. గురువారం పాత కారాయిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద స్థానిక సర్పంచ్‌లతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, సొసైటీ చైర్మన్‌ చింతనిప్పు సత్యనారాయణ ప్రజాప్రతినిధులున్నారు. 

వేంసూరు : మర్లపాడు సొసైటీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ గండ్ర సోమిరెడ్డి మాట్లాడారు.