మంగళవారం 14 జూలై 2020
Badradri-kothagudem - May 15, 2020 , 01:16:34

కరోనా యోధులకు సత్కారం..

కరోనా యోధులకు సత్కారం..

ఖమ్మం, నమస్తే తెలంగాణ :  నగరంలో పారిశుధ్య పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న నగర పాలక  సిబ్బందిని ఘనంగా సత్కరించారు. గురువారం జమ్మిబండ వాటర్‌ ట్యాంక్‌ వద్ద టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో 50 మంది జవాన్లు, ఇన్‌స్పెక్టర్లు తదితరులను పలువురు కార్పొరేటర్లు సన్మానించారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు నిరంతర సేవలందించిన పారిశుధ్య  విభాగ సిబ్బంది సేవలను పలువురు కొనియాడారు. విద్యుత్‌ విభాగంలో పనిచేస్తున్న పలువురు డీఈఈలు, ఏఈలను కూడా టీఆర్‌ఎస్‌ కా ర్మిక విభాగ నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, కార్పొరేటర్‌ పగడాల నాగరాజు, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగ నాయకులు బుర్రి వినయ్‌, సతీశ్‌, మున్సిపల్‌ డిప్యూటీ ఈఈ రంగారావు, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌, డాక్టర్‌ వినోద్‌ లాహోటి, వాల్స్‌ ఆపరేటర్లు ఫణి, రాజు, సూర్యం, శ్రీను పాల్గొన్నారు. 


logo