గురువారం 09 జూలై 2020
Badradri-kothagudem - May 15, 2020 , 01:16:23

పేదలకు వైద్య సేవలు అందించాలి

పేదలకు వైద్య సేవలు అందించాలి

కొత్తగూడెం: ‘కరోనా’ బాధితులకు చికిత్స చేస్తూనే పేదలకు వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. ఆయన గురువారం వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య, కమ్యూనిటీ కేంద్రాలవారీగా వైద్య సేవలపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలు ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం నాటికి లక్ష్యాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. 

సుజాతనగర్‌:    మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు.సుజాతనగర్‌ మండలంలోని సింగభూపాలెం చెరువులో చేపల వేటను గురువారం పరిశీలించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. 

సుజాతనగర్‌: మాస్క్‌ లేని ఓ యువకుడికి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి జరిమానా విధించారు. మండల పర్యటనలో భాగంగా గురువారం సుజాతనగర్‌కు వచ్చిన ఆయన, మాస్క్‌ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడిని గమనించారు. వెంటనే ఆ వాహనాన్ని ఆపించి, మాస్క్‌ లేకుండా ఎందుకు వెళ్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేసి, జరిమానా విధించారు.  


logo