శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - May 14, 2020 , 02:15:49

నకిలీ విత్తనాలను అరికట్టాలి

నకిలీ విత్తనాలను అరికట్టాలి

  • అదనపు కలెక్టర్‌

కొత్తగూడెం: జిల్లాలో నకిలీ విత్తనాలు, అనుమతి లేని హెచ్‌టీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు జిల్లాస్థాయి కమిటీ సిద్ధం కావాలని అదనపు కలెక్టర్‌, కమిటీ చైర్మన్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ కమిటీకి జిల్లా వ్యవసాయ శాఖాధికారి కొర్సా అభిమన్యుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. హెచ్‌టీ పత్తి విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారు. వీటి విక్రేతలపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాస్థాయి కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, కన్వీనర్‌గా డీఏవో అభిమన్యుడు, సభ్యులుగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరావు, కేవీకే కోఆర్డినేటర్‌ వీరన్న, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకటేశ్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్‌ నవీన్‌కుమార్‌  వ్యవహరిస్తారని చెప్పారు. తనిఖీ బృందంలో కొత్తగూడెం ఏఎస్పీ రమణారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏలు జి.లాల్‌చంద్‌, అఫ్జల్‌ బేగం, తెలంగాణ సీడ్స్‌ మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌, విత్తన ధ్రువీకరణ సంస్థ నుంచి వేణుమాధవ్‌ ఉంటారని తెలిపారు.