ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 12, 2020 , 01:41:50

తెలంగాణ ప్రజల దైవం సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజల దైవం సీఎం కేసీఆర్‌

  • రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ గంగారెడ్డి

వైరా/కొణిజర్ల : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, ఆయన తెలంగాణ ప్రజల దైవమని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ మారం గంగారెడ్డి అన్నారు. వైరా మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ సూతకాని జైపాల్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మక్కల కొనుగోళ్లకు రూ.3,200 కోట్లు కేటాయించారని, ధాన్యానికి దాదాపు రూ.27వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నేత దార్న రాజశేఖర్‌ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఆయన పేదలకు పంపిణీ చేశారు. మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ను ఎమ్మెల్యే రాములునాయక్‌, వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జైపాల్‌ సన్మానించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, వైరా ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య పాల్గొన్నారు. కొణిజర్ల మండలం కొండవనమాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ మారం గంగారెడ్డి, ఎమ్మెల్యే రాములునాయక్‌, వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ సందర్శించారు. 

 కలెక్టర్‌తో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ భేటీ

ఖమ్మం వ్యవసాయం: కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మారం గంగారెడ్డి సమావేశమయ్యారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. మార్కెఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌తో కలిసి కలెక్టర్‌ను జడ్పీ సమావేశ మందిరంలో కలుసుకున్నారు. జిల్లాలో మక్కల కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు అందుతున్న మద్దతు ధర, పంట రవాణా  తదితర అంశాల గురించి చర్చించారు.