ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - May 11, 2020 , 02:08:22

దాతల చేయూత

దాతల చేయూత

కొత్తగూడెం నియోజకవర్గంలో..

కొత్తగూడెం/కొత్తగూడెం అర్బన్‌/సుజాతనగర్‌/జూలూరుపాడు/కొత్తగూడెం టౌన్‌: కొత్తగూడెంలో వృద్ధులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జ్యోతి వృద్ధాశ్రమంలో దాతలు పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్‌పార్కులో పారిశుధ్య కార్మికులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి సన్మానించారు. వైస్‌ చైర్మన్‌ వేల్పుల దామోదర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. సుజాతనగర్‌లో గరీబ్‌పేట, లక్ష్మీదేవిపల్లి, సర్వారం, కోయగూడెం పంచాయతీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 2వేల కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జూలూరుపాడులో టీఆర్‌ఎస్‌ నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్‌ గిరిబాబు, జడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపీటీసీ పెండేల రాజశేఖర్‌, గాజులరాజం బస్తీలో మాజీ కౌన్సిలర్‌ కొదూరుపాక రాజేంద్రప్రసాద్‌ సరుకులు పంపిణీ చేశారు. ఆర్థికసాయం అందించారు.

ఖమ్మం నియోజకవర్గంలో.. 

మయూరిసెంటర్‌/ ఖమ్మం క్రైం/ ఖమ్మం కల్చరల్‌: ఖమ్మంలోని బీకే బజార్‌లో చెరుకూరి జనార్దన్‌రావు, కార్పొరేటర్‌ షౌకత్‌ అలీ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌,  శ్రీవాసవీ ట్రస్ట్‌ బాధ్యులు రాయపూడి రమేశ్‌, విశాలి, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, చింతనిప్పు నవీన్‌కుమార్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు. మహిళా హోంగార్డు శ్రీదేవి నగరంలో పలువురికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. శ్రీవరప్రదాత షిర్డీ సాయి మందిర చైర్మన్‌ వేములపల్లి వెంకటేశ్వరరావు బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

వైరా నియోజకవర్గంలో..

వైరా/కామేపల్లి/కారేపల్లి: వైరా నియోజక వర్గంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు, గోవింద్రాల బంజరలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆఫ్‌ బంజర యూత్‌ సభ్యులు, ఎస్సై స్రవంతి, కామేపల్లిలో సర్పంచ్‌ అజ్మీరా రాందాస్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, అప్పాయిగూడెంలో ఎట్టి అశోక్‌కుమార్‌, ఉషశ్రీ, కారేపల్లి రూరల్‌లో సీఐ బానాల శ్రీనివాసులు, ఎస్సై పొదిల వెంకన్న, అప్పాయిగూడెం సర్పంచ్‌ అజ్మీర అరుణ, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న, జైత్రాంతండా సర్పంచ్‌ లక్ష్మణ్‌ సరుకులు పంపిణీ చేశారు.

మధిర నియోజకవర్గంలో..

మధిర/ముదిగొండ/ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు డాక్టర్‌ కోట రాంబాబు, ఆజాత్‌ యూత్‌ సేవా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ చేజర్ల మల్లికార్జునరావు నిత్యావసరాలు  పంపిణీ చేశారు. మధిర ప్రభుత్వ సివిల్‌ ఆసుపత్రి వైద్యులు, 108 సిబ్బందికి ‘అన్నా’ ఫౌండేషన్‌ చైర్మన్‌ మేళం శ్రీనివాస్‌యాదవ్‌, సుశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు, డాక్టర్‌ కందుల వెంకట్‌ ఫేస్‌మాస్క్‌లు పంపిణీ చేశారు. వికాస తరంగిణి సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిల్లరకొట్లు,  చర్చ్‌ఆఫ్‌ హెల్పింగ్‌హ్యాండ్స్‌ ట్రస్ట్‌ సభ్యులు, ముదిగొండలో  తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ పోట్ల కృష్ణకుమారి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ పోట్ల ప్రసాద్‌ నిత్యాసరాలు, భోజన వసతి కల్పించారు. ఎర్రుపాలెంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎస్సై ఉదయ్‌కిరణ్‌, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో..

సత్తుపల్లి: మజీదు రోడ్‌లోని షాపు యాజమానులు 30వ వార్డులోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలపల్లి సత్యనారాయణ, వనమా శ్రీనివాసరావు, గుడిమెట్ల బుజ్జి, ముచ్చనపల్లి పాపారావు, కంభంపాటి వేణుగోపాలరావు, చల్లగుళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.

భద్రాచలం నియోజకవర్గంలో..

భద్రాచలం/దుమ్ముగూడెం: భద్రాచలంలో బూసిరెడ్డి సీతారామిరెడ్డి ట్రస్టు ప్రతినిధులు, శంకర్‌రెడ్డి, ఎస్కేటీ గ్రూపు దోసపాటి రంగారావు చారిటబుల్‌ ట్రస్టు సభ్యులు దోసపాటి రాము, గాదె మాధవరెడ్డి పలువురికి ఆహార పొట్లాలు, నిత్యావసరాలు అందజేశారు. దుమ్ముగూడెం మండలంలో ఆదివాసీ మహిళా సహాయ ఫౌండేషన్‌ సభ్యులు, సీఐ వెంకటేశ్వర్లు కిడ్నీ బాధితులకు ఆర్థిక సాయం అందించారు. అచ్యుతాపురంలో 180 కుటుంబాలకు ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ సహకారంతో ఏటీడబ్ల్యూవో పూనెం నర్సింహారావు సరుకులు అందజేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి బాలాజీనాయక్‌, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి జయబాబు, ఫౌండేషన్‌ నిర్వాహకులు లక్ష్మీనర్సమ్మ, సమ్మక్క, యశోద, సర్పంచ్‌ తెల్లం కృష్ణవేణి, ఉప సర్పంచ్‌ నాగమణి పలువురికి నిత్యావసరాలు అందజేశారు. బైరాగులపాడులో సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా దాతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రగళ్లపల్లి సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ రామారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు జయసింహ, అర్జున్‌ పాల్గొన్నారు. 

ఇల్లెందు నియోజకవర్గంలో..

ఇల్లెందు: ఇల్లెందులో టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ నాయకులు లింగాల జగన్నాథం పాల్గొన్నారు.

పాలేరు నియోజకవర్గంలో..

ఖమ్మం రూరల్‌/కూసుమంచి: ఖమ్మం రూరల్‌లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రూరల్‌ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌, ఎంపీటీసీ తోట యశోద, బాణోత్‌ రెడ్యానాయక్‌, ముత్యం కృష్ణరావు, ఉప్పల్‌రావు, శ్రీనివాసరావు, హనుమంతరావు, బ్రహ్మం, రాంబాబు, సాయిప్రభాత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో  పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, గోళ్లపాడులో మాజీ సర్పంచ్‌ మద్ది వీరారెడ్డి, కేశ్వాపురంలో శ్రీ రామ యూత్‌ సభ్యులు, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. కూసుమంచిలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. వ్యాపారులతో మాట్లాడారు. గిరాకీ లేదనే కారణంతో అధిక ధరలకు వస్తువులను అమ్మకూడదన్నారు. 

పినపాక నియోజకవర్గంలో..

మణుగూరు/అశ్వాపురం/బూర్గంపహాడ్‌: మణుగూరులో ఏఎస్పీ డాక్టర్‌ శబరీశ్‌, సీఐ ఎంఏ షుకూర్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు అడపా వెంకటేశ్వర్లు, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, తుమ్మలచెరువు, కుర్వాపల్లి కొత్తూరు, భీమవరం, రామవరంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మోరంపల్లిబంజరలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాస్‌, ఎంపీపీ కైపు రోశిరెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో..

అశ్వారావుపేట:  రామన్నగూడెం, గుంటిమడుగులో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ గిరిజన వలస కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్నవరపు కనకయ్య, కొక్కెరపాటి పుల్లయ్య  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

దమ్మపేట/ములకలపల్లి:  ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దమ్మపేటలో 20మంది ఆటోడ్రైవర్లకు మాస్క్‌లు అందజేశారు. పూసుకుంటలో రాబిన్‌ హుడ్‌ ఆర్మీ ప్రతినిధులు, తాళ్లగుంపు, ఒడ్డుగుంపు గ్రామాల్లో  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 100 కుటుంబాలకు నిత్యావసరాలు అందించగా వాటిని సొసైటీ చైర్‌పర్సన్‌ నడిపల్లి సునంద అందజేశారు.