శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 09, 2020 , 01:49:34

ప్రజాసేవకే అంకితం..

ప్రజాసేవకే అంకితం..

  • కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

సుజాతనగర్‌: నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితం అంకితమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని వేపలగడ్డ, సుజాతనగర్‌, రాఘవాపురం, మాలబంజర, కోమటిపల్లి, నిమ్మలగూడెం పంచాయతీల్లో సుమారు మూడువేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రజల కష్టనష్టాల్లో తుదికంటా పాలుపంచుకుంటానని అన్నారు. ప్రజలు సమస్యలను తన దృష్టికి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు బిందుచౌహాన్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మండె వీరహన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.