సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - May 09, 2020 , 01:49:34

శ్రీరామ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సేవలు అభినందనీయం

శ్రీరామ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ సేవలు అభినందనీయం

  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు

బూర్గంపహాడ్‌: శ్రీరామ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ నిరుపేదలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీపురంలో శ్రీరామ ఇండస్ట్రీస్‌ నిర్వాహకులు 100 క్వింటాళ్ల బియ్యం,100 క్వింటాళ్ల కూరగాయలు, 100 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను రెండు లారీల్లో అందించగా వాటిని ప్రభుత్వ విప్‌ రేగా ప్రారంభించి మణుగూరులోని తన క్యాంపు కార్యాలయానికి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతల సహకారం మరువలేనిదని, మరికొందరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, జిల్లా ఇండస్ట్రీస్‌ జీఎం సీతారాంనాయక్‌, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీశ్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు జగదీశ్‌, కార్యదర్శి హరిచంద్రనాయక్‌, ట్రెజరీ కామిరెడ్డి రామకొండారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీహరిబాబు, జాయింట్‌ సెక్రటరీ తూము రామిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్లు వెంకట్రావు, చందు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు ముత్యాలు పాల్గొన్నారు.