సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - May 09, 2020 , 01:49:36

నర్సరీ నిర్వహణ భేష్‌

నర్సరీ నిర్వహణ భేష్‌

  • తనికెళ్ల, సింగరాయపాలెంలో మంత్రి పువ్వాడ ఆకస్మిక పర్యటన 

కొణిజర్ల : మండలంలోని సింగరాయపాలెంలో నిర్వహిస్తున్న ఈజీఎస్‌ వన నర్సరీని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం తనికెళ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సింగరాయపాలెంలోని వన నర్సరీని ఎమ్మెల్యే రాములునాయక్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం విక్రయాల్లో  రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తనికెళ్లలో లారీల కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యను పరిష్కరించాలని మంత్రి అజయ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. సింగరాయపాలెంలో వననర్సరీని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ చెరుకుమల్లి రవి, సర్పంచ్‌లు చల్లా మోహన్‌రావు, దొడ్డపునేని జ్యోతి, జడ్పీటీసీ పోట్ల కవిత, తహసీల్దార్‌ దామోదర్‌, ఎంపీడీవో రమాదేవి, వైరా మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతారాములు, ఏడీఏ బాబురావు, ఏవో బాలాజీ, కోసూరి శ్రీను, ఏలూరి శ్రీను, రాయల పుల్లయ్య, బండారు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.