మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - May 06, 2020 , 01:15:41

వలస కూలీలకు అండగా ఉంటాం

వలస కూలీలకు అండగా ఉంటాం

  • ఖమ్మం ఏడీసీపీ 

ఖమ్మం క్రైం: జిల్లాలోని వలస కూలీలకు ఖమ్మం పోలీసులు అండగా ఉంటారని అడిషనల్‌ డీసీపీ దాసరి మురళీధర్‌ భరోసా కల్పించారు. ఖమ్మం నగరంలోని చుట్టు పక్కల ప్రాంతాల్లో వివిధ పరిశ్రమల్లో పని చేసే వలస కూలీలకు లాక్‌డౌన్‌లో  ఆయా పరిశ్రమల యాజమాన్యాలు పట్టించు కోకపోవడంతో వారు మంగళవారం ఇల్లెందు క్రాస్‌ రోడ్డులోని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ.. పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో వలస కూలీల తరలింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సొంత రాష్టాలకు వెళ్లేవారు ఉంటే వారిని కొద్ది రోజుల్లోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైలు మార్గం ద్వారా పంపిస్తామన్నారు. కూలీలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని గుర్తు చేశారు. జిల్లాలో ఉన్న వలస కూలీలకు పోలీసుల సహాయం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో రవీంద్రనాథ్‌, ఏసీపీలు వెంకటరెడ్డి, రామోజీ రమేశ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రావు, సీఐ తుమ్మ గోపి పాల్గొన్నారు.