మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 06, 2020 , 01:15:40

ఆపద కాలంలో ఆపన్నహస్తం..

ఆపద కాలంలో ఆపన్నహస్తం..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌కు నేటితో 42 రోజులు పూర్తయ్యాయి. నిత్యావసర సరుకులు, అత్యవసర పనులకు మినహా మిగతా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ అమలును కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎస్పీ సునీల్‌దత్‌ పర్యవేక్షిస్తున్నారు. సుజాతనగర్‌ మండలంలోని ఆటో కార్మికులకు జలగం యువసేన బాధ్యులు, మైలారం పంచాయతీ అటవీ ప్రాంతంలోగల క్రాంతినగర్‌ ఛత్తీస్‌గఢ్‌ వాసులకు, చీమలగుంపు గ్రామంలోని పేదలకు జడ్పీటీసీ సభ్యురాలు మేరెడ్డి వసంత, రామవరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సిబ్బందికి కళాస్రవంతి కోఆర్డినేటర్‌ దోతి బాబూరావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సుజాతనగర్‌ మండలంలోని ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, మాస్క్‌లను టీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చారు. పాల్వంచలోని మంచికంటి నగర్‌లోగల అన్నపూర్ణ గోశాలకు ట్రాక్టర్‌ వరి గడ్డిని పాల్వంచ సీఐ పులిగిళ్ల నవీన్‌, వేణుగోపాల్‌ థియేటర్‌ యజమాని కోనేటి మీనాకుమారి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కరకవాగు గ్రామంలో కూరగాయలు పంపిణీ చేశారు. కొత్తగూడెం 21వ వార్డులో కౌన్సిలర్‌ మాదా సత్యవతి-శ్రీరాములు దంపతులు సమకూర్చిన సరుకులను టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవేందర్‌రావు అందజేశారు. జూలూరుపాడు మండలంలోగల 24 పంచాయతీల్లోని సిబ్బందికి నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌, మధుకాన్‌ షుగర్స్‌ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు అందించిన శానిటైజర్లను స్థానిక సహకార సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి పంపిణీ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్లు, యూపీహెచ్‌సీలు, రేగళ్ల పీహెచ్‌సీలోని ఆశ వర్కర్లకు శానిటైజర్లు, మాస్క్‌లను హిమజ ట్రస్ట్‌ బాధ్యుడు గోపాలరావు అందజేశారు.

ఖమ్మం నియోజకవర్గంలో..

ఖమ్మం కోర్టు ప్రాంగణంలో టూటౌన్‌ సీఐ సమకూర్చిన నిత్యావ సరాలను న్యాయశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జిల్లా న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్‌ మంగళవారం పంపిణీ చేశారు. పేద పురోహితులకు టీఆర్‌ఎస్‌ నాయకులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ నిత్యావసరాలను పంపిణీ చేశారు.నిరుపేదలను ఆదుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరం 6వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నేత కోలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికీ కూరగాయల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం కార్పొరేషన్‌లో పని చేస్తున్న 172వాటర్‌ సప్లయర్స్‌ కుటుంబాలకు నగరానికి చెందిన  డాక్టర్లు కూరపాటి ప్రదీప్‌,అసాధారణ్‌, రవికుమార్‌ గౌడ్‌, సాయిరాం ఆధ్వర్యంలో నిత్యావసరాలను మేయర్‌ పాపాలాల్‌, నగర టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కమర్తపు మురళి చేతులమీదుగా అందజేశారు. ముస్లిం కుటుంబాలకు అఫ్జల్‌హాసన్‌ మస్జీద్‌-ఏ-క్యూ అధ్యక్షుడు షేక్‌ అఫ్జల్‌ ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. ఆర్మీ రిటైర్డ్‌ డీఎస్పీ సుబ్బారావు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు వితరణ చేశారు. నగరానికి చెందిన నరేందర్‌, నవీన్‌, రమేశ్‌, శేఖర్‌ జీవన సంధ్య వృద్ధ్దాశ్రమానికి కూరగా యలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఎడమకంటి సునీల్‌, అంగన్‌వాడీ టీచర్‌ పద్మ, పురం వెంకట్‌ పాల్గొన్నారు. నగరానికి చెందిన డాక్టర్‌,వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలాం రాష్ట్ర మహిళా ఇన్‌చార్జి  లగడపాటి హేమలత మంగళవారం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో నిత్యావసర సరుకులు ఖమ్మం సీపీ సమక్షంలో అందజేశారు. 

అశ్వారావుపేట నియోజకవర్గంలో 

అశ్వారావుపేట మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్యకర్తలు బియ్యం, కూరగాయలు అందజేశారు. ములకలపల్లిలో నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్క్‌లు అందజేశారు. రామచంద్రాపురం పంచాయతీలో సర్పంచ్‌ సుధాకర్‌ సహకారంతో జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. చండ్రుగొండ  మండలంలో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి  అధికారులు అవగాహన కల్పించారు.దమ్మపేటలో నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో శానిటైజర్లను టీఆర్‌ఎస్‌ నాయకుడు జారె ఆదినారాయణ ఎస్సై తిరుపతికి, ఏవో చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ  అధికారులకు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు.  

సత్తుపల్లి నియోజకవర్గంలో..

మండల పరిధిలోని మేడిశెట్టివారిపాలెం, కిష్టారం చెక్‌పోస్టుల సిబ్బందికి టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం శానిటై జర్లు, మాస్క్‌లు, పండ్లు అందజేశారు. వేంసూరు మండలంబీరాపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ యూత్‌ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు మంగళవారం కూరగాయలు పంపిణీ చేశారు. కల్లూరు పట్టణంలోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్‌, వికాసతరంగిణి ఆధ్వర్యంలో చినజీయర్‌స్వామి శిష్యులు రూ.50వేల విలువైన నిత్యావ సరాలు పంపిణీ చేశారు. మండలంలోని మాదిగ ఉద్యోగులు మంగళవారం పారిశుధ్య కార్మికులకు అభినందన సభ ఏర్పాటు చేసి నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

భద్రాచలంలో నిత్యావసర సరుకుల పంపిణీ

 పట్టణంలో పలుచోట్ల పేదలకు ఆహార పదార్థాలను టీఆర్‌ఎస్‌ నాయకులు కోటగిరి ప్రబోద్‌కుమార్‌, తుమ్మలపల్లి దనం, పోతుల శ్రీను, జేడీ ఫౌండేషన్‌, భద్రాద్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బాధ్యులు, కురిచేటి శ్రీనివాస్‌, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, టీఎన్‌జీవో అసోసియేషన్‌ నాయకులు డెక్కా నరసింహారావు, బాలకృష్ణ పంపిణీ చేశారు.

పర్ణశాల: మండలంలోని సీతానగరం జయంతి కాలనీ, ఎల్‌ఎన్‌.రావుపేటలో పర్ణశాల పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎండి.బహుత్‌దిన్‌ సమకూర్చిన సరుకులను ఎంపీడీవో బైరవ మల్లేశ్వరి అందించారు.

వైరా నియోజకవర్గంలో..

 కారల్‌ మార్క్స్‌ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. కొణిజర్ల మండలంలో ప్రజలందరూ ఇండ్లకే పరిమతమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఖమ్మం పట్టణంలోని వినాయక టైలర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ నిర్వాహకుడు ఇ. శ్రీనివాసరావు కామేపల్లి మండలంలోని 78 మంది పారిశుధ్య కార్మికులకు అందించిన యూనిఫాంలు, మాస్కులను ఎంపీపీ బానోత్‌ సునీత, ఎంపీడీవో సత్యనారాయణగుప్తా, తహసీల్దార్‌ నర్సింహారావు, ఎస్సై స్రవంతి పంపిణీ చేశారు. కారేపల్లిలో ప్రభుత్వం అనుమతించిన వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గాంధీనగరంలో శానిటైజర్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్‌ డేగల ఉపేందర్‌ ఉన్నారు. తిమ్మారావుపేటలో పారిశుధ్య కార్మికులను ఎస్సై శ్రీకాంత్‌, సర్పంచ్‌ ఆరెం సుహాసినిలు సన్మానించారు. అనంతరం పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 

మధిర నియోజకవర్గంలో 

పాతర్లపాడులో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం కోఆర్డినేటర్‌ కొదుమూరు జగన్నాథం, ఉపసర్పంచ్‌ తేలుకుంట్ల శ్రీనివాసరావులు కలిసి వలస కూలీలకు నిత్యావసరాలు అందించారు. అనంతరం మండల అధికారులు, సర్పంచ్‌ కాండ్ర పిచ్చయ్య వారి స్వస్థలమైన మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి పంపించారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం నుంచి ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలను జడ్పీటీసీ శీలం కవిత చొరవతో ప్రత్యేక వాహనాలలో వారి గ్రామాలకు తరలించారు. స్వరాష్ర్టాలకు వెళ్లాలనుకునే వలస కూలీలు రెండు రోజుల్లో పోలీస్‌ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ముదిగొండ ఎస్సై టీ నరేశ్‌ సూచించారు.

పాలేరునియోజకవర్గంలో...

 రూరల్‌ పోలీసులకు, విలేకరులకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు, ముదిగొండ మాజీ జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా శానిటైజర్‌లు, మాస్క్‌లు అందజేశారు. కార్యక్రమంలో కన్నేటి వెంకన్న, మద్ది వీరారెడ్డి, శ్రీనివాసరావు, పాప్యానాయక్‌, నాగండ్ల శ్రీనివాసరావు, బండి వినోద్‌ పాల్గొన్నారు. తిరుమలాయపాలెం మండలంలో జర్నలిస్టులకు, పోలీసులకు జడ్పీటీసీ బెల్లం శ్రీనివాసరావు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముదిగొండ మాజీ జడ్పీటీసీ మందడపు నాగేశ్వరరావు, జోగులపాడు సర్పంచ్‌ నల్లబెల్లి లింగయ్య, ఉడుగు ఉపేందర్‌ పాల్గొన్నారు. నేలకొండపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రోగులకు, వలస కూలీలకు పండ్లు పంపిణీ చేశారు. 

పినపాక నియోజకవర్గంలో

పట్టణంలోని సుందరయ్యనగర్‌లో దోసపాటి రంగారావు చారిటబుల్‌ ట్రస్టుఆధ్వర్యంలో దోసపాటి నాగేశ్వరరావు నిరుపేదలకు బియ్యం, సరుకులు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు వలస కూలీలకు నిత్యావసరాలు అందజేశారు. మణుగూరు ఏరియా టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావుకు ఆటో వర్క్‌షాపు  ఉద్యోగులు రూ.5వేలు అందజేశారు. మేము సైతం మిత్ర మండలి వ్యవస్థాపకుడు పసునూరి బ్రదర్స్‌ ఆధ్వర్యంలో మున్నూరు కాపు కులస్థులకు నిత్యావసరాలు అందజేశారు. పగిడేరులో కాన్సర్‌ బాధితురాలికి రేగా విష్ణు ట్రస్టు ద్వారా విప్‌ రేగా కాంతారావు రూ.2500, బియ్యం, సరుకులు అందజేశారు. బూర్గంపహాడ్‌ మండలంలోని బట్టిగూడెంలో ఆదివాసీలకు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఎంపీపీ కైపు రోశిరెడ్డితో కలిసి సరుకులు పంపిణీ చేశారు. పినపాకలోని భూపతిరావుపేటలో ప్రభుత్వ విప్‌ రేగా అందజేసిన సరుకులను జానంపేట సర్పంచ్‌ బాడిశ మహేశ్‌, ఆత్మకమిటీ చైర్మన్‌  భద్రయ్య పేదలకు అందజేశారు. అశ్వాపురం మండల పరిధి వెంకటాపురం పంచాయతీలో పాయం యువసేన ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు  నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. గొల్లగూడెం గ్రామస్థులు కలిసి సమకూర్చిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్‌ రేగా పంపిణీ చేశారు. ఆళ్లపల్లి మండలం వెంకటాపురం పంచాయతీలో సర్పంచ్‌ నర్సింహారావు మాస్క్‌లు పంపిణీ చేశారు.

ఇల్లెందు నియోజకవర్గంలో...

మండలంలోని చంద్రుతండా పంచాయతీ గోపితండా గ్రామంలో పేదలకు కూరగాయలను జవహర్‌లాల్‌ పంపిణీ చేశారు.