మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 04, 2020 , 02:09:17

వలస కూలీలను తరలించేందుకు చర్యలు

వలస కూలీలను తరలించేందుకు చర్యలు

ఏన్కూరు: వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని రేపల్లెవాడ, కేసుపల్లి గ్రామాల్లోని వలస కూలీలతో ఆయన మాట్లాడారు.  మండలంలోని వలస కూలీల వివరాలను తహసీల్దార్‌ రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. 6వేల మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లారని, ఇంకా 850 మంది వెళ్లాల్సి ఉందని, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలే ఎక్కువగా ఉన్నారని  తహసీల్దార్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో దశరథ్‌, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో అశోక్‌, సర్పంచ్‌లు బానోత్‌ నాగమణి, భూక్యా విజయకుమారి తదితరులు ఉన్నారు.

వలస కూలీల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి..

కామేపల్లి: వలస కూలీల తరలింపులో జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఆదివారం లాల్యతండాలోని వలస కూలీలతో కలెక్టర్‌ మాట్లాడారు. వలస కూలీల తరలింపునకు చేపట్టిన చర్యలపై తహసీల్దార్‌ నర్సింహారావుని ఆరా తీశారు.  కొమ్మినేపల్లి, రుక్కితండాల్లోని వలస కూలీలను అదనపు కలెక్టర్‌ స్నేహలత కలిసి తమ సొంత గ్రామాలకు వెళ్లే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో సత్యనారాయణగుప్తా, సర్పంచ్‌ మాలోత్‌ రాంచందర్‌నాయక్‌, మూడ్‌ దుర్గాజ్యోతి, లకావత్‌ బీమానాయక్‌, ఉపసర్పంచ్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు.