బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - May 04, 2020 , 02:06:41

కరోనా యోధులకు వందనం..

కరోనా యోధులకు వందనం..

  • వైద్యులు,సిబ్బంది సేవలపై ప్రశంసలు 

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న యోధులువారు. రోగులకు చికిత్స చేస్తూ.. వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తున్న వైద్యులు,సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత త్రివిధ దళాల పిలుపులో భాగంగా ఆర్మీ, రైల్వే, సివిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో  ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఆదివారం వైద్యులపై పూలు చల్లి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి, ఖమ్మం ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేశ్‌, ఆర్టీఎఫ్‌ సీఐ మధుసూదన్‌, టూటౌన్‌ సీఐ తుమ్మ గోపీ మాట్లాడారు. కరోనా వైరస్‌ బారిన పడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాణాలను కాపాడడంలో వైద్యులు, సిబ్బంది, పేషెంట్‌ కేర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్లు చేస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. వైద్యులు తమ కుటుం బాలను వదిలి బాధి తుల ప్రాణాలు కాపాడడంలో చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీ యమన్నారు. తొలుత కరోనా ఐసోలేషన్‌వార్డు ట్రామాకేర్‌ భవనం వద్ద వైద్యాధికారులు, వైద్యులకు పోలీసులు గౌరవ వందనం చేసి, వైద్యులపై పూలు చల్లారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌  బీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ సైదులు, వైద్యులు సుబ్బారావు, అశోక్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, లవణ్‌కుమార్‌, కరోనా ఐసోలేషన్‌ వార్డు విభాగ ఇన్‌చార్జ్జి సూర్యపోగు మేరి, హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు, ఫోర్త్‌క్లాస్‌, శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌, ల్యాబ్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ సీఐ చిట్టిబాబు, ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐలు వెంకటరెడ్డి, జనార్దన్‌, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి ఎం చంద్రశేఖర్‌, ఈసీహెచ్‌ఎస్‌ ఖమ్మం ఇన్‌చార్జ్‌ అధికారి రాకేశ్‌కౌల్‌, సైనిక జిల్లా సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు కేఎస్‌ ఫ్రాన్సిస్‌, కార్యదర్శి యుగంధర్‌, ఉపాధ్యక్షుడు గోపాలరావు, ఎయిర్‌ఫోర్స్‌ రిటైర్డ్‌ సార్జెంట్‌ ఎస్‌ఎం చారి, సత్యమూర్తి, అరుణ్‌,  ప్రభుత్వాసుపత్రి కార్యాలయ సూపరింటెండెంట్‌ ఆర్‌వీఎస్‌ సాగర్‌, ఎన్‌సీసీ క్యాడెట్‌ గోవిందరావు, ఉద్యోగ సంఘం నాయకులు నందగిరి శ్రీను ఉన్నారు.