బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - May 01, 2020 , 02:27:30

ప్రజలకు అండగా ఉంటా..

ప్రజలకు అండగా ఉంటా..

  • ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

బూర్గంపహాడ్‌: ఏ కష్టమొచ్చినా, ఏ సమయంలోనైనా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీపురంలో జడ్పీటీసీ దంపతులు కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి సొంత ఖర్చులతో 710 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందించగా వాటిని రేగా,  ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య పంపిణీ చేశారు. ఈసందర్భంగా రేగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం కంటే ముందే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టిందని, ప్రస్తుతం మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ కరోనా నియంత్రణలో ముందువరుసలో ఉందన్నారు. 

ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. రేగా కాంతారావు నియోజకవర్గంలో ఓ సైనికుడిలా పనిచేస్తూ మొదటి విడతలో సొంత ఖర్చులతో 10వేల కుటుంబాలకు, రెండో విడతలో  20వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఆపద్బాంధవుడిగా నిలిచారన్నారు. జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. నిత్యావసరాలు అందించిన జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కైపు రోశిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీశ్‌, ఎంపీటీసీలు వల్లూరిపల్లి వంశీకృష్ణ, జక్కం సర్వేశ్వరరావు, తోటమళ్ల సరిత, చింతా కోటేశ్వరి పాల్గొన్నారు.