ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 24, 2020 , 01:22:21

తలసేమియా బాధితులను ఆదుకుందాం:సండ్ర

తలసేమియా బాధితులను ఆదుకుందాం:సండ్ర

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ:మండల పరిధిలోని  జగన్నాథపురంలో సింగరేణి భూ నిర్వాసితులకు సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ ఆధ్వర్యంలో 130 కుటుంబాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  నిత్యావసరాలు, కూరగాయలు గురువారం పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలో మున్సిపల్‌ సిబ్బందికి నడిపల్లి ప్రభాకర్‌, లక్ష్మీకుమారి దంపతులు కుమారుడు సాయి వితరణతో 130 మందికి నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం నర్సింహారావు, మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, కమిషనర్‌ సుజాత, సంజీవరెడ్డి, వెంకటాచారి,  ఇరపా లలితా జగదీశ్‌,  ఇరపా కృష్ణారావు,  షేక్‌ చాంద్‌పాషా, అద్దంకి అనీల్‌, దొడ్డా శంకర్‌రావు, వనమా వాసు, మల్లూరి అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లిలో మే 1న నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. గురువా రం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ  రక్తహీనత, తలసేమియాతో బాధపడే వారిని ఆదుకునేందుకు సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, దాతలు సత్తుపల్లిలోని ఎంఆర్‌గార్డెన్స్‌కు హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పెనుబల్లి:కరోనా నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడమే ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. కుప్పెనకుంట్ల శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో దాతలందించిన విరాళాలతో మండలంలోని పేదలకు నిత్యావసరాలను డీసీసీబీ మాజీ  చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబుతో కలిసి గురువారం పంపిణీ  చేశారు. అనంతరం వైద్య, పారిశుధ్య కార్మికులను పూలతో సన్మానించారు. 

పెనుబల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ప్రభుత్వ  ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం దిగుబడి పెరిగిందని ఎమ్మెల్యే సండ్ర, మువ్వా విజయ్‌బాబు అన్నారు.  పెనుబల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  చెక్కిలాల మోహన్‌రావు, ఆళ్ల అప్పారావు,  నారుమళ్ల లక్ష్మీబాబు, సూరపురెడ్డి కిరణ్‌ రెడ్డి,  కనగాల వెంకటరావు,  లక్కినేని వినీల్‌, తావూ నాయక్‌, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, చీపు లక్ష్మీకాంతమ్మ,  బొర్రా వెంకటేశ్వర్లు, సామ్యేలు, కోటగిరి సుధాకర్‌బాబు, వెలివల పుల్లయ్య, పంతంగి వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.