మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 24, 2020 , 01:21:41

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

  • మంత్రి అజయ్‌కుమార్‌
  • రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు తనిఖీ

బోనకల్లు :రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడొద్దని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రైతులకు భరోసా ఇచ్చారు. గురువారం మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్లు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వరి, మొక్కజొన్న విస్తారంగా పండించారని, అందుకు అనుగుణంగా జిల్లాలో గతంలో 96 కొనుగోలు కేం ద్రాలు  ఉంటే, నేడు 446 కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రం యావత్తు భారతదేశానికే ఆదర్శంగా నిలిచి అభివృద్ధి సాధిస్తుందన్నారు. మంత్రి వెంట కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, జేడీఏ విజయనిర్మల, ఆర్‌డీఓ రవీంద్రనాథ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు బొమ్మెర రామ్మూర్తి, మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల రైతుబంధు కన్వీనర్‌ వేమూరి ప్రసాద్‌, సహకార సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, కొంగర వెంకటనారాయణ, సర్పంచ్‌లు భుక్యా సైదానాయక్‌, షేక్‌ బీజాన్‌బీ, కొమ్మినేని ఉపేందర్‌, ఎంపీటీసీ హైమావతి, తహసీల్దార్‌ రాధిక, ఎంపీడీవో జీ.శ్రీదేవి, ఎంపీ పీ సౌభాగ్యం, మధిర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చావా రామకృష్ణ, రైతుబంధు సభ్యులు మందడపు తిరుమలరావు, మంకెన రమేశ్‌, ఆత్మకమి టీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, పాల్గొన్నారు. 

ఎటువంటి వాహనాలను అనుమతించవద్దు.. 

మన జిల్లాలోకి ఎటువంటి వాహనాలను అనుమతించవద్దని మంత్రి అజయ్‌కుమార్‌ వైరా ఏసీపీ సత్యనారాయణను ఆదేశించారు. తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన బోనకల్లు లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.