గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 24, 2020 , 01:20:23

గ్రీన్‌జోన్‌గా భద్రాద్రి కొత్తగూడెం

గ్రీన్‌జోన్‌గా భద్రాద్రి కొత్తగూడెం

  • రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • జిల్లాకు రూ.20 లక్షల విలువైన శానిటైజర్లు:మాజీ ఎంపీ 

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడిలో తొలిరోజుల్లో పాజిటివ్‌ కేసులు వచ్చినప్పటికీ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని నాలుగు పాజిటివ్‌ కేసులను జీరో చేసిందని, దీంతో భద్రాద్రి జిల్లా గ్రీన్‌ జోన్‌గా మారిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో కలెక్టర్‌ ఎంవీరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో 70 కేం ద్రాలే ఉంటే ఈ సారి 207 కేంద్రాలను  ఏర్పాటు చేసినట్లు  పేర్కొన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలను కూడా పెంచి పంటను కొనుగోలు చేసిందని అన్నారు.  రైతులు ధా న్యాన్ని నిల్వ చేసుకునేందుకు ఫంక్షన్‌ హాళ్లను కూడా సిద్ధం చేశామని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్‌, వనమా రాఘవేందర్‌రావు, భద్రాద్రి జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్‌ అనుదీప్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగల రాజేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ దామోదర్‌, ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీలు భూక్యా విజయలక్ష్మి, సోనా,బాదావత్‌ శాంతి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఊకంటి గోపాలరావు, ఆర్డీవో స్వర్ణలత, డీఆర్‌వో అశోకచక్రవర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌  పాల్గొన్నారు. 

పొంగులేటి సాయం అభినందనీయం..

భద్రాద్రి జిల్లాకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.20 లక్షల విలువైన మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయడం అభినందనీయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శానిటైజర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవిష్యత్‌ కార్యాచరణ కోసమే జిల్లా అధికార యంత్రాంగానికి శానిటైజర్లు వితరణ చేయ డం జరిగిందన్నారు. సేవా తత్పరులు జిల్లాలో ఎంతోమంది ముందుకొచ్చి సేవలు చేస్తున్నారని, వారందరి సేవలు అభినందనీయమని అన్నారు. వలసకూలీలు రహదారులపై వెళ్తుం టే స్థానికులు పిలిచి భోజనాలు పెడుతున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి సాయం చేయడమే ముఖ్యమని అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ప్రముఖపాత్ర పోషించిందన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఉమ్మడి జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నారని, ఒక ఖమ్మంలోనే కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా నియంత్రణ చేయడానికి మంత్రి కృషి చేస్తున్నారని ఆయన మంత్రిని అభినందించారు. ఉమ్మడి జిల్లాలో 20 వేల లీటర్ల శానిటైజర్లను, మాస్కులను తనవంతు సహకారంగా పంపిణీ చేశానని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డితో పాటు జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా కలెక్టర్‌ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాలువతో సన్మానించారు. జిల్లాకు రూ.20 లక్షల వ్యయంతో శానిటైజర్లు, మాస్కులు అందించిన మాజీ ఎంపీ పొంగులేటిని మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్‌ ఘనంగా సన్మానించి అభినందించారు.