మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Apr 22, 2020 , 02:15:02

వలస కూలీలకు అండగా ప్రభుత్వం

వలస కూలీలకు అండగా ప్రభుత్వం

జూలూరుపాడు:వలస కూలీలు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ధైర్యం చెప్పారు.  మంగళవారం జూలూరుపాడు సహకార సంఘం కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. సూరారంలో వలస కూలీలతో మాట్లా డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్ట్‌ కెనాల్‌ నిర్మాణంలో భాగంగా గోదావరి వద్ద బ్యారేజ్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,362 కోట్లు కేటాయించిందని, ఈ నెల 26న టెండర్లు పిలవనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కెనాల్‌ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సైప్లె ద్వారా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గన్నీ బ్యాగుల కొరత నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్య లు చేపట్టిందన్నారు. రేషన్‌ కార్డుదారులకు రూ.1500 నగదు, 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ మే నెలలో కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలో 2 లక్షల 83వేల మంది రేషన్‌ కార్డ్‌ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలిపారు. ఆధార్‌ లింక్‌ తదితర కారణాలతో నిలిచిపోయిన 35వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో త్వరలో నగదు జమ చేస్తామన్నారు. 

భద్రాద్రి కలెక్టర్‌కు సన్మానం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరోనా రహితంగా మార్చి, గ్రీన్‌ జోన్‌లోకి తీసుకెళ్లిన కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని మంత్రి అభినందించి, శాలువా కప్పి సన్మానించారు. స్థ్ధానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖ వద్దకు మంత్రి వెళ్లి, అక్కడున్న ఖాతాదారులతో, రేషన్‌ కార్డుదారులతో మాట్లాడారు. మండలంలో మొత్తం ఎంతమందికి నగదు జమ అయిందో తెలపాలని మేనేజర్‌ను అడిగారు. తన వద్ద సమాచారం లేదని ఆయన చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

వలస కూలీలకు మంత్రి అభయం.. 

వలస కూలీలు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. మండలంలోని సూరారం గ్రామంలో వలస కూలీలతో మంగళవారం మంత్రి మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మిర్చి ఏరేందుకు మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, రాష్ర్టంలోని కుమ్రం భీమ్‌ జిల్లా నుంచి వచ్చినట్లు వారు చెప్పారు. చంటి పిల్లల వద్ద ఇంటి పెద్దలను ఉంచామని, మూడు నెలలు గడవడంతో అక్కడి వాళ్లంతా బెంగ పెట్టుకున్నారని, వారిలో చాలామంది ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. మంత్రి స్పందిస్తూ.. “కూలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. మీ రాష్ట్రాల్లో ‘కరోనా’ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో) ఒక్క కేసు కూడా లేదు. ప్రభుత్వం ఇస్తున్న రూ.500 నగదు, 12 కిలోల బియ్యం తీసుకుని ఇక్కడే మే 7 వరకు కాలం వెళ్లదీయండి. దుస్సాహసం చేసి వెళ్లేందుకు ప్రయత్నించవద్దు” అని కోరారు. వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థ్ధానిక అధికారులు,రైతులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మ న్‌ కోరం కనకయ్య, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, జిల్లా సహకార అధికారి మైఖేల్‌ బోస్‌, డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌, డీఎస్‌వో చంద్రశేఖర్‌, సహకార సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, ఆర్‌డీవో స్వర్ణలత, తహసీల్దార్‌ కొర్ల విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, ఏడీఏ కరుణశ్రీ, ఏ వో రఘుదీపిక, ఎంపీపీ లావుడ్యా సోని, జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా కళావతి, ఎంపీటీసీ స భ్యులు దుద్దుకూరి మధుసూదన్‌రావు, పెండేల రాజశేఖర్‌, సీఐ నాగరాజు, ఎస్సై శ్రీకాంత్‌  పాల్గొన్నారు.