శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 20, 2020 , 02:21:28

అధికారులకు సహకరించాలి: కలెక్టర్‌

అధికారులకు సహకరించాలి: కలెక్టర్‌

ఖమ్మం/ఖమ్మం రూరల్‌, నమస్తే తెలంగాణ:కరోనా అనుమానితులు జిల్లా అధికారులకు పూర్తిగా సహకరించాలని ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ సూచించారు. నగరంలోని ఖిల్లాలో నమోదైన పాజిటివ్‌ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ పర్సన్లను ఉంచిన ఎస్‌బీసీఈ ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు.అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినం: సీపీ

ఖమ్మం క్రైం: కరోనా వ్యాప్తిని అరికట్టేందకుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను జిల్లాలో మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు కంటైన్మెంట్‌ జోన్లను అదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 62 పోలీస్‌ నిఘా  బృం దాలు, 36 చెక్‌పోస్టులు, 56 పోలీస్‌ పికెటింగ్స్‌తో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్టుల్లో అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న 1371 వాహనాలు సీజ్‌ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 501 మందిపై ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసిన్నట్లు చెప్పారు. 

భౌతిక దూరమే కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు పరిష్కార మార్గమని అదనపు డీసీపీ దాసరి మురళీధర్‌ పేర్కొన్నారు. నగరంలో అదివారం షాపుల వద్ద ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీ రమేశ్‌తో కలిసి నగరంలో పలు ప్రాంతాలను సందర్శించారు.