శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 20, 2020 , 02:19:27

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి..

  • ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు

మణుగూరు, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పినపాక నియోజకవర్గంలోని అన్నార్తులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వారు అందించిన నిత్యావసర సరుకులు, నగదును ఆదివారం రేగా కాంతారావు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. అడబాల ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్‌ అడబాల శ్రీకర్‌ సహకారంతో మణుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం, కోడి ముత్తయ్యగుంపు, అశ్వాపురం మండలంలోని రాంనగర్‌, భట్టమల్లయ్యగుంపు, పాములపల్లి, బట్టీల గుంపు గ్రామాల్లో 600 మంది నిరుపేదలకు 10 కేజీల బియ్యం, రూ. 500 చొప్పున నగదు అందజేశారు. మణుగూరులోని  వలస కూలీలు, నిరుపేదలు, యాచకులకు భోజనం ప్యాకెట్లు అందించేందుకు శ్రీవిద్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం తయారు చేస్తున్న వంటలను రేగా కాంతారావు పరిశీలించారు. వంట వండారు. తరువాత, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. దాతల సహాయంతో మణుగూరు మండలంలో ప్రతి రోజూ 500 మందికి భోజనం ప్యాకెట్లు అందజేస్తున్నారు.