ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 20, 2020 , 02:17:41

నిరాడంబరంగా మంత్రి జన్మదినం

నిరాడంబరంగా మంత్రి జన్మదినం

  • జిల్లా వ్యాప్తంగా వేడుకలు 
  • మమత వైద్యశాలలో రక్తదానం చేసిన మంత్రి అజయ్‌కుమార్‌
  • పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 10 వేల నిత్యావసర సరుకుల పంపిణీ 
  • పాల్గొన్న సతీమణి, తనయుడు, తండ్రి

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా డ అజయ్‌కుమార్‌ జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా  జరిగాయి. నగరంలోని అన్ని డివిజన్లతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి అజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కు లు, కూరగాయలను టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. అనేకచోట్ల బర్త్‌డే కేకులు కట్‌ చేసి అజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వ్యాపారులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మధిర, కారేపల్లి, సత్తుపల్లి, వైరా తదితర ప్రాంతాల్లో కూడా సరుకులు పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నగరంలోని 47 డివిజన్లలో ప్రభుత్వాధికారులు గుర్తించిన 10 వేల మంది పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కుల కిట్లు అందజేశారు. మమత వైద్యశాలలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ రక్తదానం చేశారు. అనంతరం మమతా వైద్యసిబ్బంది ఏర్పాటుచేసిన కరోనా ఆకార కేక్‌ను కట్‌ చేసి కరోనా వైరస్‌ వ్యాప్తిని సమూలంగా నాశనం చేసే వరకు ప్రజ లు ఇండ్లలోనే ఉండాలని కోరారు. జయశ్రీ, కిషన్‌, నయన్‌, నరేన్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అజయ్‌ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి, తనయుడు నయన్‌రాజ్‌, తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, వదిన, మమత సంస్థల సెక్రటరీ పువ్వాడ జయశ్రీ నగరంలోని పలు డివిజన్లలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 31, 32, 33 డివిజన్లలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ పాల్గొన్నారు. 14వ డివిజన్‌లో మందడపు మనోహర్‌, కొలనుపాక శ్రీనివాసరావు, దామల ప్రసాద్‌, రమాదేవి, శకుంతల, సలీం, భద్రయ్య పాల్గొన్నారు. 16వ డివిజన్‌ సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో 230 మంది పేదలకు పువ్వాడ నాగేశ్వరరావు కిట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ కమర్తపు మురళీ, నాయకులు రెహమాన్‌, సురేశ్‌, నాగరాజు, తాజుద్దీన్‌, రామారావు, శ్రీగాద శ్రీను, ఉపేందర్‌ పాల్గొన్నారు. 9వ డివిజన్‌లో సీడ్స్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం పంపిణీ చేశారు. కార్పొరేటర్‌ నాగుల్‌మీరా, వీరయ్య, కృష్ణారావు పాల్గొన్నారు. 24వ డివిజన్‌లో పువ్వాడ జయశ్రీ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, పోట్ల శ్రీకాంత్‌, పిల్లి శేఖర్‌, కోటి పాల్గొన్నారు. 2వ డివిజన్‌లో పువ్వాడ అజయ్‌ యూత్‌ చేపట్టిన అన్నదానం కార్యక్రమాన్ని టీఎన్‌జీవోస్‌ నాయకుడు అఫ్జల్‌హసన్‌ ప్రారంభించారు. మాధవరావు, ఎల్లయ్య, భద్రయ్య పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ‘అన్నం’ ఆశ్రమంలో అన్నదానం చేశారు. సాగర్‌, అఫ్జల్‌హసన్‌, సునీల్‌రెడ్డి, విజేత, నందగిరి శ్రీను, మజీద్‌, వినయ్‌ పాల్గొన్నారు. 28వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు తొడేటి లింగరాజు, గురుమూర్తి, కే శేఖర్‌ పంపిణీ చేశారు. 39వ డివిజన్‌లో కార్పొరేటర్‌ పాలడగు పాపారావు, 40 వ డివిజన్‌లో కార్పొరేటర్‌ నీలం జయమ్మ, 41వ డివిజన్‌లో ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ కిట్లను పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్ర అప్పారావు, బొమ్మకంటి ప్రసాద్‌, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 42వ డివిజన్‌లో కార్పొరేటర్‌ రుద్రగాని శ్రీదేవి, రుద్రగాని ఉపేందర్‌, 44వ డివిజన్‌లో కార్పొరేటర్‌ తోట ఉమారాణి, తోట వీరభద్రం, 46వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కనకం లక్ష్మి, కనకం భద్రయ్య, 47వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మాటేటి నాగేశ్వరరావు, 48వ డివిజన్‌లో కార్పొరేటర్‌ తోట రామారావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఖమ్మం పట్టణ స్టీల్‌ సిండికేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బైపాస్‌రోడ్‌లోని స్టీల్‌ సిండికేట్‌ యజమానుల వద్ద పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పువ్వాడ తనయుడు నయన్‌రాజ్‌, సంఘ ప్రధాన కార్యదర్శి రాపర్తి శరత్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అసోసియేషన్‌ సభ్యులు గుదిమళ్ల విష్ణు, ఆర్‌.నరేశ్‌, అన్నారావు, హరి, శ్రీనివాసరావు, రాజేశ్‌, నాగరాజు, సురేందర్‌రెడ్డి, రంగారావు పాల్గొన్నారు. పువ్వాడ అజయ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో వసంతలక్ష్మి, ఎండీ అమన్‌ అలీ పంపిణీ చేశారు. సహాల్‌, బద్రి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌కేవీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో మదర్‌థెరిస్సా ఆశ్రమంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాటూరి లక్ష్మీనారాయణ, సునీత, పారిజాతం పాల్గొన్నారు.   

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు..

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆత్మీయ మిత్రుడు, శ్రేయోభిలాషి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) అజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అజయ్‌ నిండు నూరేళ్లూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో చేసిన పోస్టులో ఆకాంక్షించారు.