ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 13, 2020 , 02:28:17

మామిడి రైతులకు అండగా ఉంటా..

మామిడి రైతులకు అండగా ఉంటా..

  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

పెనుబల్లి, ఏప్రిల్‌ 12: నియోజకవర్గంలోని మామిడి రైతులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మామిడి వ్యాపారులు, అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మామిడి పంట ఎగుమతికి అధికారులు సహకరించాలన్నారు. మామిడి కాయల ప్యాకింగ్‌, లోడింగ్‌, రవాణా వంటి అంశాల్లో రైతులకు తోడ్పడాలన్నారు. పెనుబల్లి మండలంలోని పత్రికా విలేకరులకు ఆదివారం టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు చింతనిప్పు కృష్ణచైతన్య అందించిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే వెంకటవీరయ్య పంపిణీ చేశారు. 

అందుబాటులో వరికోత యంత్రాలు..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి నియోజకవర్గంలో 295 వరికోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరి ధాన్యం, మొక్కజొన్న పంటను రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. 

సోడియం హైపో క్లోరైట్‌ చాంబర్ల ఏర్పాటు

సత్తుపల్లి పట్టణంలోని బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌ వద్ద ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోడియం హైపో క్లోరైట్‌ చాంబర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ తోట సుజలారాణి, కమిషనర్‌ సుజాత, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

సత్తుపల్లి రూరల్‌: సత్తుపల్లిలో జవహర్‌నగర్‌లో గురుజ్యోతి వ్యవస్థాపకుడు చిత్తలూరి ప్రసాద్‌ అధ్యక్షతన పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే వెంకటవీరయ్య ఆదివారం 160 పేద కుటుంబాలకు  పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌కాలనీలో సుభాశ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. 

తాజావార్తలు