మంగళవారం 14 జూలై 2020
Badradri-kothagudem - Apr 10, 2020 , 00:18:52

అభాగ్యులకు అండగా..

అభాగ్యులకు అండగా..

కారేపల్లి రూరల్‌ : వంద మంది వలస కూలీలకు లాక్‌డౌన్‌ ముగిసేంత వరకు పర్సా ట్రస్టు ఆధ్వర్యంలో ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పర్సా పట్టాభిరామారావును అభినందించారు.  

ఖమ్మం, నమస్తే తెలంగాణ : నగరంలోని 9వ డివిజన్‌లో పొంగులేటి అభిమానులు, టీఆర్‌ఎస్‌ యూత్‌ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలను కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారులకు  రక్తదానం చేశారు. ఆశా కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. 14వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ మందడపు మనోహర్‌రావు గురువారం భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.

బోనకల్లు : మండలంలోని రావినూతలలో 30మంది కూలీలకు వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యుమన్‌ ఎక్స్‌లెన్సీ చేతన్‌ఫౌండేషన్‌ సహకారంతో గల్లా సత్యనారాయణ, వాసుదేవరావు నిత్యావసర సరుకులను అందజేశారు. కలకోటలో వలసకూలీలకు శ్రీనిధి కళాశాల కరస్పాండెంట్‌ అనీల్‌కుమార్‌, నెహ్రు సహకారంతో సర్పంచ్‌ ఎంగల దయామని, ఎస్సై కొండలరావులు పంపిణీ చేశారు. సీజీఎం చర్చి ఆధ్వర్యంలో 10మంది వృద్ధులు, దివ్యాంగులకు బియ్యం, కూరగాయలను జడ్పీటీసీ సుధీర్‌బాబు చేతుల మీదుగా ఎరినెస్ట్‌పాల్‌ అందజేశారు.  

ఎర్రుపాలెం : మామునూరులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 15 క్వింటాళ్ల కూరగాయలను గ్రామంలోని అన్ని కుటుంబాలకు పంపిణీ చేశారు. శఖునవీడులో బులెట్‌యూత్‌ అధ్యక్షుడు పసుపులేటి వెంకటనారాయణ ఆధ్వర్యంలో 10 క్వింటాళ్ల బియ్యం నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు.   

మధిర, నమస్తేతెలంగాణ : అన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని విలేకర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జాలిముడిలో సెంట్‌ఫ్రాన్సిస్‌ మధిర వారి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. న్యాయవాది దిరిశాల జగన్మోహన్‌రావు, వినోద దంపతులు పేదలకు, వలసకూలీలకు టిఫిన్‌, భోజనం అందించారు.  

పెనుబల్లి : పెనుబల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో గొత్తికోయలకు రాజసాయి మందిరం నిర్వాహకులు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ : పట్టణంలోని 30 మంది యాచకులకు జేవీఆర్‌ కళాశాల యూత్‌ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న యాచకులకు అందజేశారు.

సత్తుపల్లి రూరల్‌ : పట్టణంలోని 20వ వార్డులో కౌన్సిలర్‌ మందపాటి పద్మజ్యోతి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌ చేతులమీదుగా 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.  

ఏన్కూరు : మండలంలోని తిమ్మారావుపేటలో స్వామి వివేకనందా సేవా భారతీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్ట్‌ సభ్యులు మోత్కూరి నారాయణరావు, మోత్కూరి సత్యంబాబు, సర్పంచ్‌ ఆరెం సుహాసిని, ఎస్సై శ్రీకాంత్‌, గ్రామస్థులు యలమద్ది జనార్దన్‌, కోలా గోపి, కొనకంచి రామకృష్ణ, మిట్టపల్లి హరి, తిప్పల సత్యం పాల్గొన్నారు. యాచకుని కుటుంబానికి తిమ్మారావుపేట సర్పంచ్‌ గురువారం రూ. 500లు నగదుతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.


logo