సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 10, 2020 , 00:17:17

గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు

గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు

వైరా, నమస్తే తెలంగాణ : ప్రస్తుత యాసంగిలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ అన్నారు. మండలంలోని వల్లాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, గ్రామ సర్పంచ్‌ గొర్రెముచ్చు సారమ్మ, మన్నెం హనుమంతరావు, యాదయ్య, తుమ్మల రాణాప్రతాప్‌, పుల్లారావు పాల్గొన్నారు. 

కొణిజర్ల : మండలంలోని పలుగ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత గురువారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే  రాములునాయక్‌ సహకారంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో పల్లిపాడు, కొణిజర్ల, కొండవనమాల, చిన్నమునగాల గ్రామాల్లో ప్రారంభించారు. కార్యక్రమాల్లో సహకార సంఘం అధ్యక్షుడు చెరుకుమల్లి రవి, ఏవో బాలాజీ, ,టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోసూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

మధిర, నమస్తే తెలంగాణ :  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మధిర  సొసైటీ చైర్మన్‌ బిక్కి కృష్ణప్రసాద్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మధిరలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. 

చింతకాని : నేరడలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్‌ కొండపల్లి శేఖర్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్‌ కిలారు మనోహర్‌, మంకెన రమేశ్‌, ఎంపీటీసీ కొల్లి యామిని, సర్పంచ్‌ ఈశ్వరమ్మలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం గ్రామం వైకుంఠధామం నిర్మాణానికి శెట్టి సత్యనారాయణ జ్ఞాపకార్థం శెట్టి సురేశ్‌ రూ.2.50 లక్షల చలానాను సర్పంచ్‌ కుటుంబరావుకు అందించారు. 

ఎర్రుపాలెం : ఎర్రుపాలెం, రాజుపాలెం సొసైటీల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మధిర ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ ముజాహిద్‌, ఏవో విజయభాస్కర్‌రెడ్డి ప్రారంభించారు. 

ముదిగొండ : మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, ముదిగొండ, మేడేపల్లి సొసైటీల అధ్యక్షులు తుపాకుల యలగొండ స్వామి, సామినేని వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్‌ యాదవ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు  పాల్గొన్నారు.

కూసుమంచి రూరల్‌ : కల్లూరిగూడెం సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని గైగొళ్లపల్లి, గురువాయిగూడెం గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సొసైటీ చైర్మన్‌ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్‌ చైర్మన్‌ బజ్జూరి మల్లారెడ్డి, సర్పంచ్‌లు ముల్కూరి శ్యాంసుందర్‌రెడ్డి, కుంభం రమ, ఎంపీటీసీలు మంగ్యా, బానోత్‌ సుజాత పాల్గొన్నారు. 

నేలకొండపల్లి: మండలంలోని భైరవునిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మి గురువారం ప్రారంభించారు. పంటలను రైతులు అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు తెలిపారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

పెనుబల్లి :  పాతకారాయిగూడెం సొసైటీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్‌ చింతనిప్పు సత్యనారాయణ గురువారం ప్రారంభించారు.  పాతకారాయిగూడెం, సూరయ్యబంజరు, ముత్తగూడెం, మర్లకుంట తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.