గురువారం 09 జూలై 2020
Badradri-kothagudem - Apr 07, 2020 , 03:38:32

జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు..

జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు..

  • జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు..
  • ప్రజలు ఆందోళన చెందవద్దు 
  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మాలతి

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అందరూ భయపడినట్లుగానే ఖమ్మం జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మాలతి వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి (38) మా ర్చి 12న ఢిల్లీ వెళ్లాడు. 16వ తేదీన అక్కడ పార్టీ సమావేశంలో పాల్గొన్నాడు. తిరిగి మార్చి 18న ఢిల్లీ నుంచి నిజాముద్దీన్‌ యాత్రికులతో కలిసి రైలులో ఖమ్మం వచ్చాడు. నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తి సమాచారంతో ఈ నెల 2న పెద్దతండాలో ఈ వ్యక్తిని గుర్తించి జిల్లాలోని ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అప్పటి నుంచి అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇతని శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపించగా సోమవారం వచ్చిన రిపోర్టులు కరోనా లక్షణాలు పాజిటివ్‌గా తేలింది. ఇతని సహచరుడికి మాత్రం కరోనా లక్షణాలు లేవని తేలిందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. మరోవైపు పాజిటివ్‌ కేసు వచ్చిన వ్యక్తికి అస్తమా, ఇతర వ్యాధులు ఉండడంతో పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి పేర్కొన్నారు. ఇతన్ని వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. అయితే పాజిటివ్‌గా నమోదైన వ్యక్తిని కలిసిన 45 మందిని గుర్తించి ఖమ్మం రూరల్‌ మండలంలోని మద్దులపల్లి సమీపంలో ఉన్న వైటీసీ కేంద్రంలో క్వారంటైన్‌కు తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. 

ప్రజలు భయపడొద్దు... 

నమోదైన పాజిటివ్‌ కేసు మూలంగా ప్రజలు భయపడొద్దని, ఆ వ్యక్తికి ఉన్న ఇతర వ్యాధుల మూలంగానే పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఈ వ్యక్తి నివాసమున్న ప్రదేశాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం స్ప్రే చేయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 139 మంది వ్యక్తుల నుంచి న మూనా లను హైదరాబాద్‌కు పంపించగా అందు లో 119 మందికి లక్షణాలు లేవని వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాలో క్వారంటైన్‌ సేవల కోసం ఇప్పటికే రఘునాథపాలెం మండలం శారద క ళాశాలలో 500 పడకలు, మమత ఆసుపత్రిలో 136 పడకలు, లక్ష్య కళాశాలలో 200 పడకలు, పాలేరు ని యోజకవర్గంలో 180 పడకలు, వరంగల్‌ క్రాస్‌రోడ్‌ లో ఎస్‌బీఐటీ కళాశాలలో 300 పడకలను సిద్ధం చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ప్రభు త్వం జిల్లా ఆసుపత్రిలో 120 పడకలు, ఐసీయూ, వెంటిలేటర్ల సదుపాయంతో అందుబాటులో ఉన్నప్పటికీ మరో 200 పడకల ఐసోలేషన్‌ వార్డు కోసం కూడా పడకలు, వైద్యపరికరాలను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా నివారణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

హెల్త్‌బులిటిన్‌ విడుదల 

మయూరిసెంటర్‌:లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖమ్మం జిల్లా హెల్త్‌బులిటి న్‌ను  డాక్టర్‌ మా లతి సోమవారం విడుదల చేశారు. ఈ బులెటిన్‌ ప్రకా రం.. ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. జిల్లాలో విదేశీ ప్ర యాణికులు 580 మంది ఉన్నా రు. వీరిలో 565 మంది ఇళ్లల్లోనే క్వారంటైన్‌ పాటిస్తున్నారు. మరో 16 మంది ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మం రూరల్‌ మండలం వైటీసీ కేంద్రంలో రూరల్‌ మండలం పెద్దతండా, ఇతర ప్రాంతాలకు చెందిన 50మందిని  హోం క్వారంటైన్‌ చేశారు. ఇప్ప టి వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో మొత్తం 991 మంది ఓపీ, 153 మంది ఐపీ చికిత్స లు పొందారు. నలుగురు మమత జనరల్‌ ఆసుపత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందు తున్నారు. అనుమానిత లక్షణాలను నిర్ధారించేందుకు 153 మంది రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్‌ పంపగా అందులో 117 మందికి వ్యాధి లక్షణాలు లేవని రిపోర్టులో తేలింది.పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ లక్షణాలున్నట్లు తేలింది. మరో 35 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 


logo