సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 07, 2020 , 03:37:10

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం..

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం..

  • సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
  • జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సత్తుపల్లి రూరల్‌: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.మండల పరిధిలోని కిష్టాపురం గ్రా మంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన పంటలను విక్రయించడం కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేపట్టినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. రైతులు అధైర్యపడొద్దని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇచ్చిన కూపన్ల ప్రకారం ధాన్యం విక్రయించాలని సూచించారు. అనంతరం తుమ్మూరు గ్రామానికి చెందిన బంగార్రాజు శర్మ రూ.10వేలు సీఎం రిలీఫ్‌ఫండ్‌కు ఎమ్మెల్యే ద్వారా అందజేశారు. 

ఎర్రుపాలెం:రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలంలోని తక్కెళ్లపాడు, పెద్దగో పవరం, అయ్యవారిగూడెం సొసైటీల్లో సోమవారం మధిర ఏఎంసీ చైర్మన్‌ చావా రామకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్‌ అయిలూరి వెంకటేశ్వరరెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 

వేంసూరు: మండలంలోని వేంసూరు, పల్లెవాడ సొసైటీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. 

తిరుమలాయపాలెం: మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరుమలాయపాలెం పీఏసీఎస్‌ చైర్మన్‌ చావా వేణు ప్రారంభించారు.  

కల్లూరు: కల్లూరు సొసైటీ పరిధిలోని జీడీబీపల్లి(బోడిమెల్ల), పుల్లయ్యబంజరు రోడ్డులోని రామానగరం వద్ద సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ డైరెక్టర్‌ బో బోలు లక్ష్మణరావు, రైతు సమన్వ య సమితి మండల కన్వీనర్‌ లక్కినేని రఘు ప్రారంభించారు. 

నేలకొండపల్లి: మండలంలోని నేలకొండపల్లి, కొత్త కొత్తూరు, ఆచార్యులగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఎంఎస్‌ చైర్మన్‌ రా యల శేషగిరి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరి కంటి ధనలక్ష్మీ  ప్రారంభించారు. 

తల్లాడ:కుర్నవల్లి, తల్లాడ సొసై టీ పరిధిలోని రెడ్డిగూడెం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్లు అయిలూరి ప్రదీప్‌రెడ్డి, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. 

బోనకల్లు:మండలంలోని బ్రాహ్మణపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి, రాప ల్లె గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ప్రారంభించగా కలకోటలోని ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ప్రాజెక్టు అధికారి పద్మ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వైస్‌చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వైరా, నమస్తే తెలంగాణ:వైరా మండలంలోని పుణ్య పురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య ప్రారంభించారు. 

పెనుబల్లి: కొత్తకారాయిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు సోమవారం ప్రారంభించారు.