సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 06, 2020 , 01:30:59

సంక్షిప్త సమాచారం..

సంక్షిప్త సమాచారం..

నాగార్జున సాగర్‌ జలాలు విడుదల ..

కూసుమంచి:జిల్లాలో 2లక్షల ఎకరాల్లో పంటలకు, కృష్ణా జిల్లాలో 3 లక్షల ఎకరాల పంటలకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటిని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఎస్‌ఈ సుమతి మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామని, రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పాలేరు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కల్లూరు వరకు 102 కిమీ నీటిని ఇవ్వనున్నామని పేర్కొన్నారు.

భక్తరామదాసు  నీరు నిలిపివేత : పాలేరు రిజర్వాయర్‌ నుంచి విడుదలవుతున్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి నీటిని నిలిపివేసినట్లు ఎన్నెస్పీ జేఈ నరేందర్‌ తెలిపారు.  

రూ.10 వేలు విరాళమిచ్చిన చిన్నారి మిషిత..

మయూరి సెంటర్‌ : కువైట్‌లో నివాసముంటున్న చిన్నారి మిషిత కొవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌కు తాను దాచుకున్న రూ.10 వేలను అందించి ఔదార్యాన్ని చాటుకుంది. మిషిత తన 8వ జన్మదిన కానుకగా కరోనా వైరస్‌ నివారణకు తెలంగాణ ప్రభుత్వానికి దాచుకున్న రూ.10 వేలను విరాళంగా అందించాలని తన తల్లిదండ్రులను కోరింది. దీంతో తమ కుమార్తె మం చిగుణాన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు అభిలాష గొడిశాల-సురేశ్‌గౌడ్‌ వెంటనే కొవిడ్‌-19 రిలీఫ్‌ ఫండ్‌కు అందజేశారు. చిన్నారి పెద్ద మనస్సును మంత్రి కేటీఆర్‌  అభినం దించారు.మిషిత తల్లి అభిలాష టీఆర్‌ఎస్‌ కువైట్‌ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ కేసులు లేవు:డీఎంహెచ్‌వో

మయూరిసెంటర్‌ : జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు లేవని జిల్లా వైద్యా రోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యశాఖ అప్రమత్తంగా ఉందన్నారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో మొత్తం 962 మంది ఓపీ, 149 మంది ఐపీ చికిత్సలు పొందుతుండగా 36 మంది మమత జనరల్‌ ఆసుపత్రి కరోనా ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారని వివరిం చారు. అనుమానిత లక్షణాలను నిర్దారించేందుకు 139 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారిలో 113 మందికి వ్యాధి లేదని నిర్దారణ అయిందన్నారు. మరో 26 మంది నివేదికలు రావాల్సి ఉందని మాలతి తెలిపారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్‌

ముదిగొండ :వల్లభి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొనుగోలు కేంద్రాల వద్ద అ న్ని ఏర్పాట్లు చేశామన్నా రు. కార్యక్రమంలో సామినేని హరిప్రసాద్‌, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, సర్పంచ్‌ పోట్ల కృష్ణకుమారి, ఎంపీటీసీ రోజానీ, మేడేపల్లి సొసైటీ అధ్యక్షుడు సామినేని వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్‌ యాదవ్‌, నాయకులు పోట్ల ప్రసాద్‌, పసుపులేటి వెంకట్‌, బంక మల్లయ్య, సింగు రాజయ్య పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

నేలకొండపల్లి : బోదులబండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్‌ అనగాని అనిత, ఎంపీటీసీ కట్టెకోల సుధాకర్‌, సొసైటీ చైర్మన్‌ అనంతు కాశయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, సీఈవో నాగేశ్వరరావు, కొడాలి అచ్చిబాబు, రైతులు పాల్గొన్నారు. 

జూనియర్‌ న్యాయ వాదులకు బార్‌ కౌన్సిల్‌ చేయూత 

ఖమ్మం లీగల్‌:లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదర్కొంటున్న జూనియర్‌ న్యాయ వాదులకు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ నిర్ణయించినట్లు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కొల్లి సత్యనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో వైన్‌ షాపు దొంగలు..

రఘునాథపాలెం :రఘునాథపాలెంలోని శబరి వైన్స్‌లో శుక్రవారం తెల్లవారు జామున చోరీ జరిగిన విషయం తెలిసిందే. కాగా చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసు కున్నట్లు ఎస్సై పీ సంతోశ్‌ తెలిపారు. ఖమ్మం నగరం 3వ డివిజన్‌ పరిధి కైకొండాయిగూడెం ప్రాంతానికి చెందిన చుక్కయ్య, నాగటి వీర్రాజు చోరీకి పాల్పడినట్లు గుర్తించి శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

రోగులకు మందుల పంపిణీ ..

చింతకాని : మండలంలో ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో కార్యదర్శులు, ఉపసర్పంచ్‌లు, వైద్య సిబ్బంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు గ్రామాల్లో ఆర్‌ఎంపీ సేవలు నిలిపివేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, చైర్మన్‌ కొండపల్లి శేఖర్‌రెడ్డి పరిశీలించారు. 

సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ 

ఖమ్మం, నమస్తే తెలంగాణ/    రఘునాథపాలెం : కరోనా వైరస్‌ నివారణకు చేపట్టే సహాయక చర్యల నిమిత్తం అనేక మంది రాష్ట్ర ము ఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలను అందజేస్తున్నా రు. ఇందులో భాగంగా ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి పలువురు చెక్కు లు అందజేశారు. వీరిలో రఘునాథపాలెం మండల సర్పంచ్‌ల సంఘం రూ.4 లక్షలు, ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్స్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.2 లక్షలు, ఖమ్మం గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ అసోసియేషన్‌ రూ.లక్ష, నాగేందర్‌రావు, మణికంఠ ట్రేడర్స్‌ రూ.50,116 చెక్కులను పువ్వాడకు అందజేశారు.

తల్లాడ : కరోనా వైరస్‌ నివారణకు సీఎం సహాయ నిధికి సొసైటీ చైర్మన్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు రూ.30 వేలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలోని అందరూ ప్రజాప్రతినిధులు, తనతో కలిసి రూ.15 లక్షలను త్వరలోనే ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామన్నారు.