సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Apr 03, 2020 , 02:01:02

పత్యేక ఐసోలేషన్‌ వార్డుకు అదనంగా పడకలు సిద్ధం చేయండి

పత్యేక ఐసోలేషన్‌ వార్డుకు అదనంగా పడకలు సిద్ధం చేయండి

మయూరి సెంటర్‌, ఏప్రిల్‌ 2: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మరో 200 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కర్ణన్‌ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌తో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఇప్పటికే 120 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డు ఉందన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యగా ప్రధాన ఆసుపత్రిలో మరో 200 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రిలోని ఒకటి, రెండు అంతస్తుల్లో గల పలు వార్డులను కలెక్టర్‌ సందర్శించారు. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ కూడా పోలీసులకు ఆదేశాలు చేశారు. కరోనా బాధితులు, అనుమానితులు నేరుగా ఐసోలేషన్‌ వార్డుకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ద్వారం వద్ద ఒక ఎస్సైతోపాటు నలుగురు పోలీసు సిబ్బందిని నిరంతరాయంగా విధుల్లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఏసీపీని ఆదేశించారు. ఏడీసీపీ మురళీధర్‌రావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొలికొండ శ్రీనివాసరావు, ఏసీపీలు రామోజీరమేశ్‌, వెంకట్‌రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.