సోమవారం 13 జూలై 2020
Badradri-kothagudem - Mar 28, 2020 , 02:09:11

రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

  • సాదాసీదాగా ఉత్సవాలు
  • 2న సీతారాముల జగత్కల్యాణం
  • 3న శ్రీరామపట్టాభిషేకం 

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేపట్టనున్నారు. దశాబ్దాల తరబడి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం నవాహ్నికంగా నిర్వహిస్తున్నారు. భద్రాద్రి రామక్షేత్రంలో పాంచరాత్రగమ శాస్ర్తోక్తంగా కల్యాణాన్ని కన్నుల పండువగా తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 2న జరిగే శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 3న నిర్వహించే శ్రీరామపట్టాభిషేకం వేదికను  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. logo