శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Mar 20, 2020 , 01:37:17

నేటినుంచి ఆర్జిత సేవలు రద్దు..

నేటినుంచి ఆర్జిత సేవలు రద్దు..

  • భద్రాద్రి రామాలయంలో అమలు
  • కరోనా నేపథ్యంలో నిర్ణయం
  • అన్నదానం, కల్యాణకట్ట మూసివేత
  • ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయశాఖ కమిషనర్‌
  • నవమి వేడుకలు రామాలయం ప్రాంగణంలోనే..

భద్రాచలం, నమస్తే తెలంగాణ: కరోనా అదుపునకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకలు మిథిలా ప్రాంగణంలో కాకుండా ఈసారి రామాలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిర్వహించేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆర్జిత సేవలను కూడా శుక్రవారం నుంచి నిలుపుదల చేయనున్నారు. అర్చనలు, వివిధ రకాల అభిషేకాలు, నిత్యకల్యాణాలు నిలిపివేశారు. భక్తులకు ప్రతిరోజూ నిర్వహించే అన్నదానం కూడా ఆపివేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను కూడా మూసివేస్తున్నారు. కేవలం భక్తులకు ఉచిత, ప్రత్యేక దర్శనములకు మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులను యథావిధిగా అమలు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో నరసింహులు ప్రకటించారు. భక్తులు సామూహికంగా కాకుండా విడివిడిగా స్వామివారి దర్శనములను సాఫీగా చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఆర్జిత సేవలు, అన్నదానం, కల్యాణకట్ట పునరుద్ధరణ తేదీలను కమిషనర్‌ ఆదేశాల మేరకు తర్వాత ప్రకటించడం జరుగుతుందని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు. ఇప్పటికే దేవస్థానం అధికారులు కరోనాపై అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను, కరపత్రాలను ముద్రించి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆలయం, ఆలయ పరిసరాలు, ఉపాలయాలు, దేవస్థానం కాటేజీలు, సత్రాలు తదితర వాటిల్లో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. సిబ్బంది గ్లౌజ్‌లు, మాస్క్‌లు ధరించి పనులు చేస్తున్నారు. స్వామివారి ప్రసాదాల తయారీ విభాగం, సేల్స్‌ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 


logo