సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 20, 2020 , 01:26:09

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

  • 13,073 మంది హాజరు..
  • 82 మంది గైర్హాజరు
  • 99.37 హాజరు శాతం నమోదు
  • పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్‌ స్కాడ్‌లు
  • కేంద్రాల వద్ద శానిటైజర్ల ఏర్పాటు.. 

పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా గురువారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి.జిల్లాలోని 75 పరీక్షా కేంద్రాల్లో 13,155 మంది విద్యార్థులకు 82 మంది గైర్హాజరయ్యారు. గుర్తించిన 13  సమస్యాత్మక సెంటర్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.  నాలుగు పరీక్షా కేంద్రాలను డిస్ట్రిక్ట్‌ లెవల్‌ అబ్జర్వర్లు, ఏడింటిని జిల్లా విద్యాశాఖ అధికారులు, 24 కేంద్రాలను ఫ్లయింగ్‌ స్కాడ్‌లు తనిఖీ చేశాయి. విద్యార్థులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. వారికోసం కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రం లోకి వెళ్లే ముందు, పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులు  చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కునే విధంగా వాష్‌బేషిన్లను ఏర్పాటు చేశారు. 

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. విద్యార్థు లు 8:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు విద్యార్థులను క్షు ణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి వెంట వచ్చి కేంద్రంలోకి పంపించారు.  పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశా రు. దగ్గరలోని అన్ని జిరాక్సు సెంటర్లను మూసి వేయించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. జిల్లాలో 75 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 13,155 మంది విద్యార్థులకు 13,073 మంది పరీక్షలకు హాజరయ్యా రు. 99.37 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో 13 సమస్యాత్మక సెంటర్లను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పదో తరగతి పరీక్షలను ప్ర శాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి పి.సరోజినిదేవి తెలిపారు. జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను డిస్ట్రిక్ట్‌ లెవల్‌ అబ్జర్వర్లు, ఏడు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు, 24 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్‌ స్కాడ్‌లు తనిఖీ చేశారు. 

పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లు...

 కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. అదే విధంగా పరీక్షా కేంద్రం లోకి వెళ్లే ముందు, పరీక్షలు పూర్తైన తరువాత విద్యార్థులు తమ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకునే విధం గా వాష్‌బేషిన్లను ఏర్పాటు చేశారు. దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదులను కేటాయించి పరీక్షలు రా యించారు. ఎక్కువ మంది విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు. ఇన్విజిలేటర్లు, ఆయా పాఠశాలల సిబ్బంది సైతం ముఖానికి మాస్కులు ధరించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.