బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 09, 2020 , 00:08:08

ఆహ్లాదంగా లేక్‌వ్యూక్లబ్‌

ఆహ్లాదంగా లేక్‌వ్యూక్లబ్‌

మయూరిసెంటర్‌: మెట్రోపాలిటన్‌ నగరాలకు దీటుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో పూర్తి ఆహ్లాదభరిత వాతావారణంలో లేక్‌వ్యూక్లబ్‌లో సభ్యులుగా చేరిన వారికి మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు భారదేశంలోనే తొలి షటిల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌పూల్‌ క్రీడలను తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో పరిచయం చేస్తుంది ఖమ్మం లేక్‌వ్యూక్లబ్‌ (కేఎస్‌సీ). ప్రపంచ దేశాలలో అత్యాధునిక హంగులతో కూడిన పలు క్రీడలకు చెందిన ఇండోర్‌ స్టేడియాలు, వివిధ దేశాలకు చెందిన వంటకాలు, కార్టేజ్‌లకు ఆనుకుని ఉన్న స్విమ్మింగ్‌పూల్స్‌ ఈ క్లబ్‌ ప్రత్యేకత. క్రీడారంగంలో భారతదేశంలోనే షటిల్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో తొలి రెడ్‌సిథంటిక్‌ కోర్ట్‌ను క్లబ్‌ సభ్యులలోని క్రీడాకారుల కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించనున్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తునే క్లబ్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతో ఈ క్లబ్‌ సందర్శన నిమిత్తం ఇప్పటివరకు ఈ క్లబ్‌లో అగ్రసినీతారలు, వారి సినిమాలకు చెందిన ఆడియో వేడుకలకు ఈ క్లబ్‌ వేదికగా నిలిచి మెట్రోపాలిటన్‌ నగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు తరహా నగరాల వాసులు, సినీరంగం ప్రముఖులను సైతం ఖమ్మం జిల్లా పేరును మార్మోగేలా చేసింది ఈ క్లబ్‌. క్లబ్‌ చైర్మన్‌ దొడ్డా రవి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక పరికరాలు, వసతులతో సాంకేతిక పరిజ్ఞానంతో ఖమ్మం లేక్‌వ్యూక్లబ్‌ భారతదేశంలోనే తనదైన గుర్తింపును పొందింది. 

v  జిల్లాకేంద్రంలో లేక్‌వ్యూ క్లబ్‌ లైఫ్‌ టైం మెంబర్‌ షిప్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇటీవల లాంఛనంగా ప్రారంభించి తొలి మెంబర్‌ షిప్‌ను స్వీకరించారు. క్రీడా విభాగంలోని స్నూకర్‌ క్రీడను, దేశంలోనే తొలిసారిగా పాదాలతో ఆడే ఫుట్‌పూల్‌ స్నూకర్‌ గేమ్‌ను పరిచయం చేయడం గర్వకారణమని చెప్పవచ్చు. ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు లాంటి నగరాలలో విస్తరించి ఉన్న ఇలాంటి క్లబ్‌లు మన ఖమ్మం జిల్లా కేంద్రంలో లేక్‌వ్యూ క్లబ్‌ అధ్యక్షుడు దొడ్డా రవి, క్లబ్‌ డైరెక్టర్లు, తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్‌, శ్రీకాంత్‌ ఐతరాజుల  ఆధ్వర్యంలో క్లబ్‌ ఏర్పాటు చేయడం సంతోషదాయకం.

v  భారతదేశంలోనే ప్రతి కాటేజ్‌కు స్విమ్మింగ్‌ పూల్‌ అందుబాటులో ఉండే సౌకర్యం ఈ క్లబ్‌ ప్రత్యేకత. లైఫ్‌ టైం మెంబర్‌ షిప్‌ పొందడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలలో తమ లేక్‌వ్యూవ్‌ క్లబ్‌కు అనుసంధానంగా ఉన్న క్లబ్‌లను మెంబర్‌షిప్‌ పొందిన వారు కుటుంబ సమేతంగా సందర్శించవచ్చు. ఖమ్మం జిల్లాను పర్యాటక కేంద్రంలో భాగంగా మరింత తీర్చిదిద్దుతూ దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి సైతం, ఇతరదేశాలలో అందుబాటులో ఉండే సౌకర్యాలను ఖమ్మం జిల్లా కేంద్రంలో అందించాలనే లక్ష్యంతోనే ఈ లేక్‌వ్యూవ్‌ క్లబ్‌ను స్థాపన జరిగింది. 

ఇవీ ప్రత్యేకతలు..

దేశంలో ఎక్కడా లేని విధంగా కేరళ ఆయుర్వేద స్పా సదుపాయం, కార్టేజీలకు సమీపంలో స్విమ్మింగ్‌పూల్స్‌, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా జిమ్‌, యోగా, ఇండోర్‌లో క్రికెట్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలు, బాల్‌రూమ్‌ పేరుతో బాంకెట్‌హాల్‌ ప్రపంచం మొత్తంలో సీ వ్యూవ్‌, రివర్‌ వ్యూవ్‌ లేక్‌వ్యూలో ఉన్న బాంకెట్‌హాల్స్‌కు, హోటల్స్‌ సదుపాయం. తెలుగు రాష్ర్టాలలో తొలిసారిగా లేక్‌వ్యూవ్‌ సైడ్‌ బాంకెట్‌హాల్‌, క్లబ్‌లోనే 300ల మంది సభ్యులు కూర్చునే సదుపాయం ఉంది. సిలికా సాండ్‌ (ఇసుక)ను విదేశాల నుంచి దిగుమతి చేసి బీచ్‌వాలీబాల్‌ కోర్టును ఇందులో ఉన్న క్రీడాకారుల కోసం అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా హోంథియేటర్‌లో 24మంది కూర్చుని మూవీ, క్రికెట్‌ వీక్షించే సదుపాయం. మహిళల కోసం కిట్టిపార్టీ హాల్స్‌ ఏర్పాటు, 100మందికి పైగా తంబోలా ఆడే విధంగా తంబోలా హాల్‌ఏర్పాటు.  అదేవిధంగా ఫ్యామిలీ రెస్టారెంట్‌, కాఫీషాప్‌ ఏర్పాటు, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఔట్‌డోర్‌ యాంపీ థియేటర్‌లో నూతన చిత్రాల ప్రదర్శన. ఇండోర్‌, ఔట్‌డోర్‌లలో బార్‌ సదుపాయంతో ఇతర దేశాలలో లభ్యమయ్యే బార్బీక్యూ జాతీయస్థాయి రెస్టారెంట్లలో లభించే బార్బీక్యూ టేబుల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ టేబుల్స్‌ పై ఎవరి వంట వారే చేసుకునే సదుపాయం, పూల్‌ స్నూకర్‌ గేమ్‌లో కాళ్లతో ఆడే గేమ్‌లు ఇందులోని ప్రత్యేకతలు. 

సినీ తారల సందడి..

‘వెంకీమామ’ చిత్రం ఆడియో వేడుకలో భాగంగా హీరో హీరోయిన్లు, ‘చిత్రలహరి’ చిత్ర బృందం, దర్శకులు రాఘవేంద్రరావు, ‘అశ్వద్థామ’ ఫ్రీరిలీజ్‌ వేడుకలో భాగంగా హీరో, హీరోయిన్లు , మరియు హీరోలు గోపీచంద్‌, శివబాలాజీ, తారకరత్న, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి, రాణా, గేయ రచయితలు, ప్రముఖ యాంకర్లు కలుపుకుని మొత్తం 23మంది సినీతారలు ఈ క్లబ్‌ను సందర్శించి వాహ్‌ ఖమ్మం, కేఎల్‌సీ అని కితాబిచ్చారు.