శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 23:47:59

భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు..

భద్రాచలం, నమస్తే తెలంగాణ మార్చి6: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ముందుగా సుప్రభాతసేవ నిర్వహించారు. తదుపరి గోదావరి నది నుంచి తీర్ధబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో శ్రీసీతారామచంద్రస్వామివారికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులు స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించండి అదనపు కలెక్టర్‌తో ఎంపీ నామా నాగేశ్వరరావు 

ఖమ్మం, నమస్తే తెలంగాణ : జిల్లాలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యులు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు. శుక్రవారం రాత్రి ఎంపీ నామా ఢిల్లీ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావుతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షం కారణంగా మిర్చి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించి రైతులకు ధైర్యాన్ని అందివ్వాలని కోరారు.