మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 23:47:13

రోజూ చెత్త సేకరిస్తున్నారా?

రోజూ చెత్త సేకరిస్తున్నారా?

రఘునాథపాలెం, మార్చి 6: ట్రైనీ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి శుక్రవారం ఉత్తమ గ్రామ పంచాయతీ రేగులచలకలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో జరిగిన అభివృద్ధిని పర్యవేక్షించారు. ఇంటింటికీ చేపట్టిన ఇంకుడు గుంతలను పరిశీలించారు. అంతేకాక ప్రతి రోజు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఇంటింటికీ పంచాయతీ కార్మికులు చెత్త సేకరణ చేపడుతున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను కలిసి ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ట్రైనీ కలెక్టర్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ నిరంతరాయంగా జరగాలని కార్యదర్శి సంగీతను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కొర్లపాటి రామారావు, ఉపసర్పంచ్‌ నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నర్సరీని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్‌

నేలకొండపల్లి : నేలకొండపల్లిలోని గ్రామీణ వననర్సరీని ట్రైనీ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి శుక్రవారం పరిశీలించారు. అక్కడ పెంచుతున్న మొక్కల గురించి తెలుసుకున్నారు. హరితహారం ప్రారంభించే నాటికి మొక్కలను సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. ప్రతి నర్సరీలో అనుకున్న లక్ష్యాని కంటే ఎక్కువ మొక్కలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌, ఏపీవో సునిత, ఈసీ శేషగిరి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారుపాల్గొన్నారు.