మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 06, 2020 , 00:24:12

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 8691మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8382 మంది పరీక్షకు హాజరయ్యారు. 309 మంది గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన విధించడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకున్నారు. పరీక్ష ముగిసేంత వరకు కేంద్రాల సమీపంలోని జిరాక్సు సెంటర్లను మూసివేయించారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌, మాస్‌ కాపీయింగ్‌ కేసులు నమోదు కాలేదు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌, పరీక్షల కన్వీనర్‌ జహీర్‌ అహ్మద్‌ తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఈసీ మెంబర్లు కూడా ఉన్నారు. మొత్తం 30 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.