శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 04, 2020 , 23:38:28

డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కూరాకుల

 డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కూరాకుల

ఖమ్మం వ్యవసాయం : జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కూరాకుల నాగభూషణం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన తన చాంబర్‌లో సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు హాజరయ్యారు. చైర్మన్‌గా ఎన్నికైన తరువాత తొలిసారిగా డీసీసీబీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మంత్రి పువ్వాడకు, చైర్మన్‌కు డీసీసీబీ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు. ఈ నెల8న డీసీసీబీ కార్యాలయం ఆవరణలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల అభినందన సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బుధవారం శుభ ముహుర్తం ఉన్నందున చైర్మన్‌ తన చాంబర్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తుంది. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వీ వసంతరావు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్‌ జీ పాపాలాల్‌, ఉప మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌తో పాటు బ్యాంక్‌ డైరెక్టర్లు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కూరాకుల వలరాజుతో పాటు బ్యాంక్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.