గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Mar 01, 2020 , 01:02:08

కేటీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేద్దాం..

కేటీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేద్దాం..

ఇల్లెందు, నమస్తే తెలంగాణ: అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి మంత్రి కేటీఆర్‌ సభను సక్సెస్‌ చేయాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌లు అన్నారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై  ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. పట్టణ పర్యటనతోపాటు సింగరేణి జేకే కాలనీ హైస్కూల్‌ మైదానంలో నిర్వహిస్తున్న సభకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మైదానం కెపాసిటీ, ఎన్ని కుర్చీలు వేస్తున్నారు. ఎంత విస్తీర్ణంలో షామియానా వేస్తున్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభలో విద్యుత్‌ సౌకర్యంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతలను సమన్వయంతో పంచుకోవాలన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు తాగునీటిని అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటేషన్‌ మెరుగ్గా ఉండేందుకు  పంచాయతీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ప్రజలకు అల్పాహారం, మజ్జిగ వంటి సౌకర్యాలు సమకూర్చాలన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పొదుపు సంఘాల ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ డీవీ, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎస్‌డీ జానీ, కమిషనర్‌ వీరేందర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.