బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 29, 2020 , 00:13:41

‘ప్రగతి’ బాటలో పట్టణాలు

‘ప్రగతి’ బాటలో పట్టణాలు

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఇల్లెందు మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ సూచించారు. శుక్రవారం  ఆమె పట్టణ ప్రగతిలో భాగంగా వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రగతి పనులను పరిశీలించారు. పారిశుధ్యం, డ్రైనేజీ తదితర మరమ్మతుల పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని మున్సిపల్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందాయన్నారు. అదే విధంగా పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలన్ని అభివృద్ధి వైపు పరుగులు పెడుతాయన్నారు.సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 


మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్నారు. మున్సిపల్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పాలకవర్గం దృష్టి కేంద్రీకరించి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇల్లెందు అభివృద్ధి పథంలో పయనించేందుకు పట్టణ ప్రగతి వంటి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 1న మంత్రి కేటీఆర్‌ ఇల్లెందు పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు వస్తున్నారని , ఇల్లెందు పాలకవర్గం, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టణ ప్రగతి పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.