బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 28, 2020 , 00:04:26

అందరికీ సంక్షేమం..అదే ప్రభుత్వ లక్ష్యం..

అందరికీ సంక్షేమం..అదే ప్రభుత్వ లక్ష్యం..

ఖమ్మం, నమస్తే తెలంగాణ :రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణంగా ఖమ్మం జిల్లాను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తూ జిల్లాలో నూతన అధ్యా యానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వేల కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులు పూర్తికాగా మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. అధినేతల వద్ద తనకున్న పలుకుబడితో మంత్రి పువ్వాడ జిల్లా అభివృద్ధికి నిధులను తీసుకవ స్తున్నారు. సీఎం కేసీఆర్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సీఎంను మించిన  దిట్ట దేశంలో ఎవరు లేరు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఈ కొద్ది కాలంలోనే రెండు జిల్లాల్లో సైతం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రహదారులు అభివృద్ధ్దితో పాటు  సంక్షేమ రంగంలో అనేక పథకాలను ప్రజలకు చేరవేశారు. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచారు. ప్రజా ప్రతి నిధులు ప్రజల వద్దకే వెళ్లేలా నూతన సంస్కరణలు తీసుకువచ్చారు. దీంతో ప్రజలకు ఉన్న దూరభారం తగ్గిపోయింది. అనునిత్యం అధికారుల వద్దకేల్లే ఇబ్బందులు లేవు. 


అభివృద్ధిలో ఖమ్మం అగ్రగామి...

 దేశంలో కల్లా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్రలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి మిగిలిన ఏ జిల్లాల్లో జరుగకపో వడం గమనార్హం.  2 వేల కోట్లతో జిల్లాలో రహదారుల నిర్మాణం జరుగుతుంది. అనేక బ్రిడ్జీలు, క ల్వర్టు నిర్మాణలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు మార్గం ఏర్పడింది. బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఉన్న భద్రాద్రి దేవాల యాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రణా ళికలను రూపొందించారు. అంతేకాకుండా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను రూపొందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తోటి ప్రజాప్రతిని ధులను కలుపుకుని ఐక్యతతో పనిచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాం గాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లా సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషిచేస్తున్నా రు. ఖమ్మం జిల్లా రెండు  జిల్లాలుగా విడిపోయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం రెండు జిల్లాల్లో జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను రూపొందిస్తున్నారు.


మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

వేసవి కాలం వచ్చిందంటే ఖమ్మానికి నీటి గండమే. గత నలభై ఏండ్లుగా మున్సిపల్‌ పీఠంపై కూర్చున్న సీపీఎం నాయకులు నగర ప్రజల గొంతును వారానికి మూడు రోజులు కూడా తడపలేక పోయిందన్నది జగమెరిగిన సత్యం. కానీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత ఖమ్మం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించబోతున్నది. కేఎంసీ అమృత్‌ పథకాన్ని మిషన్‌ భగీరథ పథకానికి అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 230 కోట్లతో మెగా మంచినీటి ప్రాజెక్ట్‌ను నగర ప్రజల ముందు ఆవిష్కరించారు. పాలేరు నుంచి వస్తున్న శుద్ధిచేసిన కృష్ణా జలాలు అతికొద్ది కాలంలోనే నగరంలోని ఇంటింటికీ రానున్నాయి. నగర పౌరులు ఒక్కొక్కరికి రోజుకు 150 లీటర్ల చొప్పున వచ్చే 30 ఏండ్లపాటు సరఫరా చేసేవిధంగా పక్కా ప్రణాళికలను రూపొందించిన ఘనత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పాలకపక్షానికే దక్కుతుంది. దీనికంటే ముందు ఉమ్మడి ప్రభుత్వంలో మంజూరు చేసిన రూ. 74 కోట్ల మంచినీటి ప్రాజెక్ట్‌ను సైతం తెలంగాణ ఆవిర్భావం తర్వాత నే పూర్తిచేయించి ఆవిష్కరించటం గమనార్హం. 


రూ. వెయ్యి కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి..

 దాదాపు రూ. 1000 కోట్ల పైచిలుకు నిధులతో నగరంలో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కారుకే దక్కుతుంది. కార్పొరేట్‌ నగరాలకు దీటుగా ఖమ్మాన్ని ఆవిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేశారు.  నగరపాలకసంస్థకు ఏటా రూ. 100 కోట్లు కేటాయించిన సర్కారు, వాటితో అంతర్గత రహదారులు, నిరంతర మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నగర ప్రజల అవసరాలకు తగిన విధంగా కార్పొరేషన్‌ కార్యాలయాన్ని నిర్మించేందుకు రూ. 14 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. గ్రేటర్‌ తరహాలో ఖమ్మం ఎన్నెస్పీ, మరికొన్ని ప్రాంతాల్లో ఏసీ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ. 10 కోట్లతో పూర్తిచేశారు. దీనిని మార్చి 1వ తేదీన రాష్ట్ర ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించ బోతున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణలో గజ్వేల్‌ తరువాత ఖమ్మంలోనే రెండో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం జరిగింది. దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  logo