శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 23:56:30

‘పట్టణప్రగతి’ బృహత్తర కార్యక్రమం

‘పట్టణప్రగతి’ బృహత్తర కార్యక్రమం

వైరా, నమస్తే తెలంగాణ: అనేక ఉద్యమాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 8,10వ వార్డుల్లో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పారిశుధ్య పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని ఎమ్మెల్యే రాములునాయక్‌ తొలగించి శుభ్రపరిచారు. అంతేకాకుండా రోడ్ల వెంట పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా టీఎస్‌ బీపాస్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేక మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఇప్పటి నుంచి ఆన్‌లైన్‌లోనే భవనాల నిర్మాణానికి అనుమతులు ఇస్తారని చెప్పారు. 75 గజాలలోపు స్థలంలో పట్టణాల్లో ఇళ్లు కట్టుకునే వారు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతిని తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.  నూతనంగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం రూ.20కోట్ల నిధులను మంజూరు చేసిందని వివరించారు. ఈ నిధులతో అతి త్వరలో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు సహకారంతో వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, కమిషనర్‌ విజయానంద్‌, వైరా జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వార్డు కౌన్సిలర్లు కర్నాటి నందిని, కన్నెగంటి సునీత, టీఆర్‌ఎస్‌ నాయకులు దొంతబోయిన చింతయ్య, దొంతబోయిన గోపి, కన్నెగంటి హుస్సేన్‌, పూర్ణకంటి రామారావు, సీపీఎం నాయకులు కర్నాటి 

హనుమంతరావు  పాల్గొన్నారు. 


logo