శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Feb 26, 2020 , 23:58:42

పట్నాలకు ప్రగతి శోభ

పట్నాలకు ప్రగతి శోభ

వైరా, నమస్తే తెలంగాణ : కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం అభివృద్ధికి సోపానం అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5,9,11 వార్డుల్లో బుధవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌తో కలిసి డ్రైనేజీల్లో ఉన్న చెత్తా చెదారాన్ని, మురికి కూపాన్ని తొలగించారు. మంచినీటి చాంబర్‌ ఏర్పాటు పనుల్లో పాల్గొన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికే వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రూ.20కోట్ల నిధులను మంజూరు చేశారని వివరించారు.  అదనపు కలెక్టర్‌ స్నేహలత మాట్లాడారు. మున్సిపాలిటీ సిబ్బందికి మాస్క్‌లు పంపిణీ చేశారు. వైరా మున్సిపాలిటీ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముళ్ళపాటి సీతారాములు, కమిషనర్‌ విజయానంద్‌, వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వార్డు కౌన్సిలర్లు సూర్యదేవర వింద్యారాణి, మాదినేని సునీత, ఇండ్ల వసంత, టీఆర్‌ఎస్‌ నాయకులు కట్టా కృష్ణార్జున్‌రావు, సూర్యదేవర శ్రీధర్‌, వజినేపల్లి చక్రవర్తి, ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo