బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 26, 2020 , 23:51:49

మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

మధిర, నమస్తేతెలంగాణ:ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల నిధులను రాబట్టి ఆయా నిధుల ద్వారా మధిర మున్సిపాలిటీ సంపూర్ణ అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు పేర్కొ న్నారు. బుధవారం మధిర మున్సిపాలిటీ చైర్‌ప ర్సన్‌గా ఎన్నికైన మొండితోక లతజయాకర్‌ పదవీ బాధ్యత స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థలంటే అందరూ కలిసి పనిచేసుకోవాలని,ఎన్నికలతో రాజకీయాలు అయిపోయాయని, పాలనపై దృష్టిసారించి ప్రజలు మెచ్చుకునే విధంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉందో ఏ అవసరానికి డబ్బు లు కావాలో చూసి ఆ వార్డులో ఖర్చు చేసి వెను కబడిన వార్డులను సైతం అభివృద్ధి చేసుకునే వి ధంగా కృషిచేయాలన్నారు. ఇప్పటికే మధిర మున్సి పాలిటీలో 16 కోట్ల రూపాయల పనులు పురోగతి లో ఉన్నాయని, ఇంకా కొన్ని పనులు ప్రారంభిం చాల్సి ఉందని, అన్ని పనులను మొ దలుపెట్టి త్వరితగతిన పూర్తిచేయాలని సూచిం చారు. రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మధిర పాలకవ ర్గం ప్రజాసమస్యలు పరిష్కారానికి కృషిచేస్తూ మధిర అభివృద్ధికి బాటలు వేయాలని పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం మాట్లా డుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషిచేయాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పలుఅభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగు తుందని, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని సూచించారు.  మధిర మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ చావా రామకృష్ణ మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్ర జలకు అందిస్తూ మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేయాలని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత జయాకర్‌  మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందిస్తూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషిచేస్తూ సుపరి పాలనను ప్రజలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ ప్రగతికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. పెద్దల ఆశీస్సులతో పద వి చేపట్టడం జరిగిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పెద్దల, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా  కృషిచేయడం జరుగతుందని పేర్కొన్నారు. అభివృద్ధికి తప్ప అవినీతికి చోటు లేకుండా పాలన అందించడం జరుగుతుందన్నారు. వైస్‌చైర్‌పర్సన్‌ యరమల విద్యాలతవెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను సద్వినియోగపరుస్తూ అభివృద్ధికి కృషిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం వీరయ్య చౌదరి దంపతులు గజమాలతో మధిర మున్సి పాలిటీ చైర్‌పర్సన్‌ మొండితోక లత, జయాకర్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. అదే వి ధంగా పలువురు వారికి అభినందనలు తెలుపుతూ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కాంగ్రె స్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మల్లాది వాసు, టీఆర్‌ఎస్‌ పార్టీ  ఫ్లోర్‌లీడర్‌ యన్నంశెట్టి వెంకటఅప్పారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు మొండితోక జయాకర్‌, ఎంపీపీ మెండెం లలిత, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్‌ కమీషనర్‌ ఎం.దేవేందర్‌, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. 


logo