బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 24, 2020 , 00:53:39

క్రీడాకారుల శ్రేయస్సుకు కృషి చేస్తా

క్రీడాకారుల  శ్రేయస్సుకు కృషి చేస్తా

మయూరి సెంటర్‌, ఫిబ్రవరి 23: మీ అందరి అశీస్సులతో.. మీరు వేసిన ఓట్లతో నేను ఈ స్థాయికి ఎదిగానని, క్రీడాకారుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి పాటు పడతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో సుధాకర్‌రెడ్డి మెమోరియల్‌ పేరుతో నిర్వహించిన మూడు జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడలాభివృద్ధి, క్రీడాకారుల భవిష్యత్‌కు చెందిన అంశాలు, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియంలో నాలుగు కోర్టులలో సింథటిక్‌ మ్యాట్‌లను ఆయన ఆవిష్కరించారు. టోర్నమెంట్‌ చైర్మన్‌, అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరిపురపు సుదర్శన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. క్రీడాకారుల శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సమగ్ర క్రీడాభివృద్ధి కోసం అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని,  స్టేడియంలో ఆగిపోయిన పనులను త్వర్వితగతిన  పూర్తి చేస్తానన్నారు. బ్యాడ్మింటన్‌ కోర్టులను పూర్తిస్థాయి అభివృద్ధి చేశామని, సర్ధార్‌ పటేల్‌స్టేడియంలో శాశ్వత ప్లడ్‌ లైట్లు టవర్స్‌ను ఏర్పాటు చేసేందుకు తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. నాలుగు కోట్ల రూపాయలతో జిల్లా కేంద్రంలోని సర్ధార్‌ పటేల్‌స్టేడియం, పెవిలియన్‌గ్రౌండ్‌లో ఇండోర్‌ స్టేడియం నిర్మాణంకు తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనికోసం దాదాపు రూ. 1 కోటి కేటాయించామన్నారు. ఓటు ద్వారా నన్ను గెలిపించిన ప్రజల కోసం పూర్తిస్థాయిలో అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. 


తల్లిదండ్రులు వారి పిల్లల చదువులతో పాటు వారికి ప్రావీణ్యం ఉన్న, నచ్చిన క్రీడలను ప్రోత్సహిస్తూ పిల్లలో దాగిఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని క్రీడావిభాగాలకు చెందిన వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, క్రీడాభివృద్ధిలో భాగంగా జిల్లా యువజన, క్రీడలాధికారి పరంధామరెడ్డి, క్రికెట్‌ అంశంలో సీనియర్‌ క్రీడాకారుడు మతీన్‌ కృషి అభినందనీయమన్నారు. పటేల్‌ స్టేడియంలో పువ్వాడ ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో డే అండ్‌ నైట్‌ టోర్నమెంట్స్‌ను జాతీయస్థాయి క్రీడాపోటీలను నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు. కొన్ని క్రీడావిభాగాలలో కోచ్‌ల అవసరం ఉందని, ఈ అంశంలో క్రీడలశాఖా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లి క్రీడాకారుల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. రూ.5 లక్షలతో ప్రారంభమైన స్టేడియం అభివృద్ధి పనులు రూ. 4 కోట్లతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే నెల 1వ తేదీన జిల్లా కేంద్రంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియంను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలలో భాగంగా కబడ్డీ క్రీడను కూడా ప్రభుత్వం సముచిత ప్రధాన్యతను ఇచ్చిందన్నారు.  రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల్ల వెంకటేశ్వరరావు కబడ్డి క్రీడ గురించి తీసుకొచ్చిన అంశాలను ఆయన గుర్తుచేశారు. 


అనంతరం ఖమ్మం నగర మేయర్‌ పాపాలాల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాతే ఖమ్మంలో క్రీడాభివృద్ధికి తగిన చర్యలు తీసుకున్నామని దీనిని అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు తోడ్పాటు అందించారు. అనంతరం రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు జీ వెంకట్రావు మాట్లాడుతూ.. గత ఐదేండ్లలో ఖమ్మం క్రీడాభివృద్ధిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయని, దీనికి కారణం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని క్రీడా సంఘాల నేతలు, క్రీడాకారుల ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను గజమాలతో సన్మానం, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఘంటా వెంకట్రావు శాలువాతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, డీవైఎస్‌వో ఎం. పరంధామరెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధి సిరిపురపు సుదర్శన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు, ఆర్జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షులు కమర్తపు మురళీ, బచ్చు విజయ్‌కుమార్‌, పోట్ల వీరేందర్‌, కాటమనేని రమేష్‌, పీ రవిమారుత్‌, డాక్టర్‌ సావిత్రి,  పవన్‌, రాజేష్‌,  జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  విజేతలకు బహుమతుల ప్రదానం.. అండర్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో మిన్‌టూ వరంగల్‌ ప్రథమ బహుమతి, హర్హ ద్వితీయ బహుమతి, సుందర్‌ వర్షిత్‌ తృతీయ బహుమతులు పొందారు. బాలికల సింగిల్స్‌ విభాగంలో నిష్టసంతోషిని ప్రథమ బహుమతి, చిత్ర ద్వితీయ, కేషోత్రా తృతీయ బహుమంతి అందుకున్నారు. అండర్‌-15 బాలుర సింగిల్స్‌ విభాగంలో ప్రథమ బహుమతి భవ్యాస్‌, ద్వితీయ బహుమతి యశ్వంత్‌రెడ్డి, తృతీయ సూర్యవర్థన్‌ రెడ్డిలు మంత్రి అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా బహుమతులందుకున్నారు. 


విజేతలకు బహుమతుల ప్రదానం..


అండర్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో మిన్‌టూ వరంగల్‌ ప్రథమ బహుమతి,  హర్హ ద్వితీయ బహుమతి, సుందర్‌ వర్షిత్‌ తృతీయ బహుమతులు పొందారు. బాలికల సింగిల్స్‌ విభాగంలో నిష్టసంతోషిని ప్రథమ బహుమతి, చిత్ర ద్వితీయ, కేషోత్రా తృతీయ బహుమంతి అందుకున్నారు. అండర్‌-15 బాలుర సింగిల్స్‌ విభాగంలో ప్రథమ బహుమతి భవ్యాస్‌, ద్వితీయ బహుమతి యశ్వంత్‌రెడ్డి, తృతీయ సూర్యవర్థన్‌ రెడ్డిలు మంత్రి అజయ్‌కుమార్‌ చేతుల మీదుగా బహుమతులందుకున్నారు. 


logo