సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 22, 2020 , 00:28:28

పట్టణ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

పట్టణ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 21: పట్టణ ప్రగతిలో చేపట్టే అంశాలపై ప్లాన్‌ యువర్‌ టౌన్‌ ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ఈనెల 24నుంచి ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణలో పట్టణాలు స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను, ప్రత్యేక అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణపై ఈనెల 20న నిర్వహించిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలను తెలిపామన్నారు. ప్రారంభ కార్యక్రమం పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నివసించే ప్రాం తాల నుంచి చేపట్టాలని ఆయన చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహణకు ప్రతీ వార్డుకు ప్రత్యేక అధికారుల నియామకంతో పాటు, ప్రతీ మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారులను పర్యవేక్షణాధికారులుగా ని యమించామన్నారు. పల్లెల బాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం స్ఫూర్తిగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్‌ ఆ ప్రకటన లో  పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో మన జిల్లాను నంబర్‌వన్‌గా నిలిపేందుకు మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యులు అంకితభావంతో పట్టుదలతో కృషిచేసి మున్సిపాల్టీలను ఆదర్శ ము న్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలన్నారు. 


మున్సిపల్‌ చట్టం ప్రకారం అలసత్వం వహిస్తే ప్ర జా ప్రతినిధులపైనా, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. పట్టణాల్లో పేరుకుపోయిన వ్య ర్ధాలను తొలగించడం, ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరుచేయడంతో పాటు తడి చెత్తతో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతీ వార్డుకు యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు, ప్రముఖ వ్యక్తులతో క మిటీలు రూపొందించామని,  ప్రతీ కమిటీ లో 15మంది చొప్పున మొత్తం 60 మంది తో వార్డు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24వ తేదీ నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టనున్నందున ఈ రెండు రోజులు మున్సిపాలిటీల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పట్టణ ప్రగతి విశిష్టతను తెలియజేయాలని చెప్పా రు. ప్రతీ పట్టణంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో సమీకృత కూరగాయల మార్కెట్లు నెలకొల్పేందుకు ప్రతీపాదనలు తయారు చేయాలని చెప్పారు. ఖర్చు లు విషయంలో పారదర్శకత పాటించాలని చెప్పారు. పట్టణాల్లో విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్‌ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. 


మున్సిపాలిటీల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, మొక్కలు పెంపకం, పారిశుద్య కార్యక్రమాలను ప్రాధాన్యతాంశాలుగా పరిగణించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారంతో పట్టణాలు పరిశుభ్రంగా సుందరంగా తయారు చేసేందుకు ప్రభుత్వం చక్కని కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మొక్క లు పెంపకాన్ని విరివిగా చేపట్టాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని చెప్పారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన కార్యక్రమాలకు రేటింగ్స్‌ ఇచ్చి ఉత్తమ మున్సిపాల్టీలను ఎంపిక చేసిన ప్రోత్సాహకాలనివ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పరస్పర సహకారంతో పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ భాగస్వాము లు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మార్చి 15నుంచి 31వతేదీ వరకు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాల ద్వారా పల్లె ప్రగతి పురోగతిని పర్యవేక్షణకు చేయించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. 


పల్లె ప్రగతిలో నిర్ల క్ష్యం వహించిన సంబంధిత గ్రామ పంచాయతీలపై చర్యలు ఉంటాయన్నారు. ఈనెలాఖరు నాటికి మొక్కలు పెంపకానికి విత్తనాలు పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీపీవోలో మొక్కలు పెంపకానికి సంబంధిత సమ గ్ర నివేదికలను అందజేయాలన్నారు. ప్రతీ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌ ఉండాలని, జనాభా తక్కువున్న పంచాయతీలకు ట్రాలీ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 25వ తేదీ లోగా అన్ని పంచాయతీల్లో ట్రాక్ట ర్లు, ట్రాలీలు, మొక్కలుకు నీరుపోసేందుకు వాటర్‌ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వీటి విషయంలో ఎల్‌డీఎం, డీపీ వో ప్రతీ రోజు తనకు నివేదికలు అందించాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు ఏర్పాటు కావాలని, ఇంకనూ స్థల సేకరణ చేయని గ్రామ పంచాయతీలకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.