బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 19, 2020 , 00:50:37

మహా శివరాత్రికి శైవక్షేత్రాలు సిద్ధం..

మహా శివరాత్రికి శైవక్షేత్రాలు సిద్ధం..

మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు..

  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు
  • భక్తులకు అసౌకర్యం కలుగకుండావసతులు..
  • జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన సిబ్బంది

మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.. ఆయా దేవాలయాల పరిధిలో నిర్వహించే జాతరకు తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. జూలూరుపాడులోని సోమలింగేశ్వరస్వామి               దేవాలయం, పాల్వంచలోని శ్రీఆత్మలింగేశ్వరస్వామి ఆలయం,                 చండ్రుగొండ మండలం బెండాలపాడులోని కనిగిరి వీరభద్రుని ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీభ్రమరాంబ సమేత శ్రీమల్లిఖార్జున స్వామి దేవాలయం, ఖమ్మం రూరల్‌ మండలంలోని తీర్థాల, కూసుమంచి శివాలయం, మధిరలో శ్రీమృత్యుంజయస్వామి ఆలయం, పెనుబల్లిలోని నీలాద్రీశ్వర దేవాలయాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.     -నెట్‌వర్క్‌


చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారులో గల కనిగిరి గుట్టలపై వీరభద్రుని ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతుంది. కాకతీయుల కాలం నాటి దేవాలయం కావడంతో భక్తులు ఏటేటా శివరాత్రి ఉత్సవాలకు పెరుగుతూ వస్తున్నారు. 21తేదీ శుక్రవారం నాడు మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. వేదపండితులు వీవీఆర్‌కే మూర్తి, దామరచర్ల దొరగారు రాజా, బెండాలపాడు ఆదివాసీ గిరిజనులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు వెళ్లాలంటే బెండాలపాడు నుంచి సుమారు పది కిలోమిటర్ల మేరకు అటవీ ప్రాంతంలో కొంతదూరం వాహనాలు, మరి కొంత దూరం కాలినడకన గుట్టలపై ఎక్కి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మొక్కులు చెల్లించే వారు పెరుగుతుండటంతో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 


శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం చరిత్ర.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామ శివారు దక్షిణ భాగంలో పది కిలోమీటర్ల దూరంలో గల పర్వత పంక్తులలో కనగిరి గుట్టలపై శ్రీ వీరభద్రుని దేవాలయం క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం ఏలిన ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించబడిందని, అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలు, కట్టడాలను బట్టి తెలుస్తోంది. సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, ఇక్కడ ఆలయాన్ని కాకతీయులు నిర్మించారు. ఈ కనకాద్రి గుట్టలపై 100 ఎకరాల విస్తీర్ణంలో దుర్భేద్యమైన కోట రాతితో నిర్మించారు. కాకతీయుల అనంతరం ఎవరూ ఈ ప్రాంతాన్ని, కోటను ఆలయాన్ని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. 1958వ సంవత్సరంలో దామరచర్ల ముఖ్తేదార్‌ శ్రీ సోమరాజు వేంకటేశ్వరరావు జమిందారు, వారి వారసులు నాటి నుంచి నేటి వరకు ప్రతీ సంవత్సరం శివరాత్రి కల్యాణానికి పట్టు వస్ర్తాలు, బియ్యం, నేటికీ తీసుకొచ్చి శివపార్వతుల కల్యాణం జరిపించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయంలో 1907 సంవత్సరంలో పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ విప్పరల రామయ్య శర్మ నిర్వహించారు. అనంతరం వారి వారసులు నిర్వహిస్తున్నారు. 


logo