గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 19, 2020 , 00:39:24

ఉత్కంఠ భరితంగా కబడ్డీ పోటీలు

ఉత్కంఠ భరితంగా కబడ్డీ పోటీలు

ఇల్లెందు నమస్తే తెలంగాణ: రాష్ట్రస్థ్దాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ను వ్వా.. నేనా అన్న రీతిలో వివిధ జిల్లాల జట్లు తలపడుతున్నాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.

  • ఇల్లెందులో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రీడలు
  • పోటాపోటీగా తలపడుతున్న జట్లు
  • మంగళవారం 35 జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌లు
  • తరలివచ్చిన క్రీడాకారులు, అభిమానులు

ఇల్లెందు నమస్తే తెలంగాణ: రాష్ట్రస్థ్దాయి కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ను వ్వా.. నేనా అన్న రీతిలో వివిధ జిల్లాల జట్లు తలపడుతున్నాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. ప్లడ్‌లైట్ల వెలుతురులో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. మంగళవారం రెండోరోజూ రాత్రి మహిళా, పురుషుల విభాగంలో మ్యాచ్‌లు కొనసాగాయి. కొన్ని జట్లు 1,2 పాయింట్లతో విజయాన్ని కోల్పోతున్నాయి. మంగళవారం రాత్రి వరకు మహిళా, పురుషుల విభాగంలో 35 జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. 


మహిళా విభాగంలో..

మహిళా విభాగంలో సిద్దిపేట వర్సెస్‌ వరంగల్‌ రూరల్‌ జట్లు తలపడగా వరంగల్‌ రూరల్‌ విజయం సాధించింది. సూర్యపేట, జగిత్యాల జట్లు తలపడగా సూర్యపేట జట్టు విజయం సాధించింది. వరంగల్‌ రూరల్‌, జగిత్యాల జట్లు తలపడగా వరంగల్‌ రూరల్‌  విజయం సాధించింది. నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య ఆసక్తికర పోటీ జరుగగా నల్గొండ విజయం సాధించింది. జయశంకర్‌ భూపాలపల్లి, సిరిసిల్ల జట్ల మధ్య హోరాహోరీలో భూపాలపల్లి జట్టు విజయం సాధించింది. భూపాలపల్లి, నల్గొండ జట్ల మధ్య జరిగిన పోటీలో నల్గొండ జట్టు విజయం సాధించింది. రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. కామారెడ్డి, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో కామారెడ్డి విజయం సాధించింది. హైదరాబాద్‌, మహబూబాబాద్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో హైదరాబాద్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. మేడ్చల్‌, నిర్మల్‌ జట్ల మధ్య జరిగిన పోరులో మేడ్చల్‌ జట్టు విజయం సాధించింది. ఖమ్మం, వరంగల్‌ అర్బన్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో ఖమ్మం విజయం సాధించింది. వనపర్తి, ఆసీఫాబాద్‌ మధ్య జరిగిన ఆసక్తికర పోరులో వనపర్తి జట్టు విజయం సాధించింది. కరీంనగర్‌, మంచిర్యాల జట్ల మధ్య పోరులో మంచిర్యాల జట్టు విజయం సాధించింది. సంగారెడ్డి, ములుగు జట్ల మధ్య జరిగిన పోటీలో సంగారెడ్డి విజయకేతనం ఎగురవేసింది. పెద్దపల్లి, మెదక్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో మెదక్‌ జట్టు విజయం సాధించింది. నిజామాబాద్‌, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో భువనగిరి జట్టు విజయకేతనం ఎగురవేసింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జట్టు విజయకేతనం ఎగురవేసింది. 


పురుషుల విభాగంలో..

పురుషుల విభాగంలో వికారాబాద్‌, ఖమ్మం జట్ల మధ్య జరిగిన పోరులో ఖమ్మం జట్టు విజయం సాధించింది. పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం సాధించింది. రంగారెడ్డి, భువనగిరి జట్ల మధ్య జరిగిన పోరులో రంగారెడ్డి విజయం సొంతం చేసుకుంది. వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం విజయం సాధించింది. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్‌ విజయం సాధించింది. ఆదిలాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల జట్ల మధ్య జరిగిన పోరులో మేడ్చల్‌ జట్టు విజయం సాధించింది. నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో నాగర్‌ కర్నూల్‌ విజయం సాధించింది. వరంగల్‌ అర్బన్‌, కామారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వరంగల్‌ అర్బన్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. సిద్దిపేట, ములుగు జట్ల మధ్య జరిగిన పోరులో సిద్దిపేట జట్టు ఆసక్తికరమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వనపర్తి, రాజన్న సిరిసిల్ల జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో సిరిసిల్ల జట్టు విజయం సొంతం చేసుకుంది. ఆసీఫాబాద్‌, సూర్యాపేట జట్ల మధ్య జరిగిన పోరులో సూర్యాపేట విజయం సొంతం చేసుకుంది. సంగారెడ్డి, పెద్దపల్లి జట్ల మధ్య జరిగిన పోరులో సంగారెడ్డి జట్టు విజయకేతనం ఎగురవేసింది. జోగుళాంబ గద్వాల్‌, నల్గొండ జట్ల మధ్య జరిగిన పోరులో జోగుళాంబ గద్వాల్‌ జట్టు గెలుపు సొంతం చేసుకుంది. నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాల పల్లి జట్ల మధ్య జరిగిన పోరులో నిజామాబాద్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. మెదక్‌, మంచిర్యాల జట్ల మధ్య జరిగిన పోరులో మెదక్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. జగిత్యాల, హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠపోరులో హైదరాబాద్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. జనగాం, మహబూబ్‌నగర్‌ జట్ల మధ్య జరిగిన పోరులో మహబూబ్‌నగర్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది. రంగారెడ్డి, మహబూబాబాద్‌ జట్ల మధ్య  ఉత్కంఠపోరులో మహబూబాబాద్‌ గెలిచింది. 


తరలివచ్చిన క్రీడాభిమానులు, ప్రముఖులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఇల్లెందులో తొలిసారిగా నిర్వహిస్తుండడంతో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేకించి కబడ్డీ క్రీడాభిమానులు వివిధ జిల్లాల నుంచి కబడ్డీ పోటీలను తిలకించేందుకు తండోపతండాలుగా వచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు రావడం గమనార్హం. మహిళలు సైతం కబడ్డీ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి క్రీడాభిమానులు తరలివచ్చారు. క్రీడాకారులకు, వీఐపీలకు భోజన వసతిని కల్పించారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ బానోత్‌ హరిసింగ్‌నాయక్‌, కన్వీనర్‌ స్వాతిముత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు సుధీర్‌తోత్లా, ఎస్‌ రంగనాథ్‌, లింగాల జగన్నాథం, యలమద్ది రవి, మేకల శ్యామ్‌ తదితరులు క్రీడలను తిలకించారు. తరలివచ్చిన క్రీడాభిమానులు జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీలను తిలకిస్తూ కేరింతలు, కేకలు, ఈలలు వేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు.


logo