మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 17, 2020 , 23:40:51

అభినవ కాటన్‌ సీఎం కేసీఆర్‌..

అభినవ కాటన్‌ సీఎం కేసీఆర్‌..

మణుగూరురూరల్‌: జన హృదయనేత, బంగారు తెలంగాణ సృష్టికర్త, అభినవ కాటన్‌ సీఎం కేసీఆర్‌ అని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఐకేపీ కార్యాలయం, కమలాపురంలోని పంప్‌హౌజ్‌ ఆవరణం, పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి భారీగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 30వేల మొక్కలను నాటడం జరిగిందన్నారు. హరితహారం ఎంతో చక్కటి కార్యక్రమమని, అంతటి చక్కని కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహానేత సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, ఎంపీడీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటస్వామి, మణుగూరు, అశ్వాపురం సొసైటీ చైర్మన్లు కుర్రి నాగేశ్వరరావు, తుళ్లూరి బ్రహ్మయ్య, వైస్‌ ఎంపీపీ కేవీరావు, సొసైటీ వైస్‌ చైర్మన్‌ దొండేటి రామ్మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు ముత్యంబాబు, అడపా అప్పారావు, ఐకేపీ ఏపీఎం అహ్మదులా, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, పెద్ద ఎత్తున మండల, పట్టణ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. 


పలుచోట్ల సీఎం పుట్టిన రోజు వేడుకలు

మణుగూరు మండలంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అన్ని పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు కేక్‌లు కట్‌ చేశారు. అనంతరం పంచాయతీల ఆవరణంలో మొక్కలను నాటారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కేక్‌లు కట్‌ చేసి అందరికి అందజేశారు. మణుగూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రామానుజం, భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ ఆవరణలో సీఈ బాలరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో వైద్యులు, సిబ్బంది మొక్కలను నాటారు. 


నియోజకవర్గంలో పచ్చదనం నిండాలి

బూర్గంపహాడ్‌: హరితహారంలో భాగంగా పినపాక నియోజకవర్గం మున్ముందు పచ్చదనంతో నిండాలని ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం బూర్గంపాడు మండల పరిధిలోని సందెళ్ల రామాపురంలో ఐటీసీ సహకారంతో 2500 మొక్కలను ఏర్పాటు చేయగా, వాటిని నాటి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రాస్‌రోడ్‌లోని సందెళ్ల రామాపురం వద్ద ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దె వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీసీ సహకారంతో అందించిన మొక్కలను ఐదు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన గుంతల్లో నాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఒక్కరోజే నియోజకవర్గంలోని బూర్గంపహాడ్‌, మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో 30వేల మొక్కలను నాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్‌వీ.సుబ్రమణ్యం, మణుగూరు డివిజన్‌ ఎఫ్‌డీవో వేణుబాబు, తహసీల్దార్‌ కిషోర్‌, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జడ్పీటీసీలు కామిరెడ్డి శ్రీలత, పోశం నర్సింహారావు, అశ్వాపురం, బూర్గంపహాడ్‌ సొసైటీ చైర్మన్లు తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.