శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 16, 2020 , 01:01:00

బంజారాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

బంజారాల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

వైరా, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి15: రాష్ట్రంలోని బంజారాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి సందర్భంగా బోగాబండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై సేవాలాల్‌ మహరాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని కొనియాడారు. మేరామాయాడి భవాని సేవకుడిగా, మహా భక్తుడిగా బంజారాల జాతి ఉన్నతికి ఆయన కృషి చేశారని కొనియాడారు. 


బ్రిటీష్‌ సామ్రాజ్యంలో బ్రిటీష్‌ వారు బంజారాలకు చేస్తున్న హింసలను ఎదిరించి సేవాలాల్‌ మహరాజ్‌ పోరాటాలు చేశారన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైరా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, స్పెషల్‌ ఆఫీసర్‌ సత్యనారాయణరావు, మండల అభివృద్ధి అధికారి రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌ హలావత్‌ రంగా, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముళ్లపాటి సీతారాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు మిట్టపల్లి నాగి, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, మాదినేని సునీత, తడికమళ్ల నాగేశ్వరరావు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, సూర్యదేవర వింద్యారాణి, మరికంటి డేడికుమారి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ లాల్‌మహ్మద్‌, మన్నేపల్లి శ్రీను, మోటపోతుల సురేష్‌, బంజారా సంఘం నాయకులు బానోత్‌ నర్సింహానాయక్‌, బీక్యా, సాదవులు పాల్గొన్నారు.